నిలిచిపోయిన ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్

ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్టాజెనెకా ఫార్మా కంపెనీ కలిసి తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ ఆస్టాజెనెకా ట్రయల్స్‌ను

Update: 2020-09-09 04:23 GMT

ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్టాజెనెకా ఫార్మా కంపెనీ కలిసి తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ ఆస్టాజెనెకా ట్రయల్స్‌ను నిలిపివేశారు. మూడవదశ ట్రయల్స్‌లో ఈ వ్యాక్సిన్ వికటించడంతో వెనక్కుతగ్గినట్టు తెలుస్తుంది. మూడవదశ ట్రయల్స్‌లో భాగంగా వ్యాక్సిన్‌ను బ్రిటన్ వాసిపై ప్రయోగించారు. అయితే, ఆ వ్యక్తికి తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్ కనిపించడంతో ఈ ట్రయల్స్ ను నిలిపివేస్తున్నట్టు తెలిపింది. కరోనాను అడ్డుకట్ట వేసేందుకు ప్రపంచవ్యాప్తంగా పలు ఫార్మాకంపెనీలు వ్యాక్సిన్ తయారీలో నిమగ్నమైన సంగతి తెలిసిందే. అయితే, మెజారీటీ ప్రజలు ఆస్టాజెనెకా వ్యాక్సిన్ పై ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. కానీ, మూడో దశలో ఈవ్యాక్సిన్ వికటించడంతో మరింత ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తుంది.

Tags:    

Similar News