KCR : లండన్‌లో ఘనంగా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు
KCR : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు లండన్‌లో ఘనంగా జరిగాయి. ఎన్నారై టీఆర్‌ఎస్ యూకే ఆధ్వర్యంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించి సంబరాలు జరుపుకున్నారు.;
KCR : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు లండన్‌లో ఘనంగా జరిగాయి. ఎన్నారై టీఆర్‌ఎస్ యూకే ఆధ్వర్యంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించి సంబరాలు జరుపుకున్నారు. భారీ కేక్ కట్ చేసి కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. అధ్యక్షుడు అశోక్ దూసరి నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి యూకే నలుమూలల నుంచి దాదాపు 200 మంది ఎన్నారైలు హాజరయ్యారు. ఉద్యమ నాయకుడే పాలకుడై తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలిపారని... ఇలాంటి నాయకుడు ఉండడం తెలంగాణ ప్రజల అదృష్టమని... ఎన్నారై టీఆర్‌ఎస్ యూకే అధ్యక్షుడు అశోక్ దూసరి అన్నారు. కేసీఆర్ నాయకత్వమే మనకు శ్రీరామ రక్ష అని... సందర్భం ఏదైనా అందరూ వారి నాయకత్వాన్నే బలపర్చాలని... ఇతర నాయకులు పిలుపునిచ్చారు.