Kyriakos Mitsotaki as Greek PM : గ్రీక్ ప్రధానిగా మిత్సోటాకి

రెండవసారీ విజయ బావుటా ఎగరేసిన న్యూ డెమోక్రసీ పార్టీ నేత

Update: 2023-06-26 09:15 GMT

గ్రీక్ దేశ ప్రధానమంత్రిగా కైరియాకోస్ మిత్సోటాకి రెండో సారి ఘన విజయం సాధించారు. గ్రీస్ దేశ జాతీయ ఎన్నికల్లో న్యూ డెమెక్రసీ పార్టీకి చెందిన మిత్సోటాకి 40.5 శాతం ఓట్లు సాధించి విజయబావుటా ఎగురవేశారు. 300 సీట్ల పార్లమెంట్ లో సుమారు 158 సీట్లు పొంది విజేతగా నిలిచారు. ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడం ద్వారా ప్రజల అభిమానం పొంది న్యూ డెమోక్రసీ పార్టీ ఎన్నికల్లో విజయం సాధించింది. నిజానికి కొద్ది రోజుల క్రితం జరిగిన గ్రీస్ పడవ ప్రమాదం వల్ల ఎన్నికల ప్రచారం కాస్త వెనుకబడింది. అయితే ప్రమాదం ఎన్నికలపై పెద్దగా ప్రభావాన్ని చూపలేదని తెలుస్తుంది. మిత్సోటాకి 2019లో మొదటిసారిగా ప్రధానమంత్రి అయ్యారు. గతసారి కూడా న్యూ డెమోక్రసీ పార్టీ గెలిచినప్పటికీ ఇంత పరిపూర్ణమైన మెజారిటీ మాత్రం పొందలేదు.

మిత్సోటాకి విజయం పై పలు దేశాల నేతలు తమ అభినందనలు తెలియజేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ లు మిత్సోటాకికి అభినందనలు తెలిపారు. ఇటలీ విదేశాంగ మంత్రి ఆంటోనియో తజానీ సైతం తన అభినందనలు తెలిపారు. మిత్సోటాకి తిరిగి ఎన్నిక కావడం మొత్తం యూరప్‌కు మంచి రాజకీయ స్థిరత్వానికి సంకేతమని ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

Tags:    

Similar News