Delta Airlines: అదుపుతప్పి విమానం బోల్తా.. 18 మందికి గాయాలు
నడాలోని టొరొంటో పియర్స్ విమానాశ్రయంలో ఘటన;
కెనడాలోని టొరంటో పియర్‌సన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రమాదం చోటు చేసుకుంది. విమానం ల్యాండ్ అవుతుండగా అదుపుతప్పి తలకిందులుగా బోల్తాపడింది . ఈ ఘటనలో 18 మంది గాయపడ్డారు. వీరిలో ఓ చిన్నారి సహా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఎయిర్‌పోర్టు అధికారులు వెల్లడించారు.
విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో తిరగబడటంతో 15 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో విమానంలో 80 మంది ప్రయాణికులున్నారు. డెల్టా ఎయిర్ లైన్స్‌కు చెందిన విమానం కెనడాలోని టొరొంటో పియర్సన్ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బలమైన గాలులే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు.
గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వీరిలో ఒక చిన్నారి కూడా వుంది. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. విమానం మిన్నియాపొలిస్ నుంచి వస్తున్నట్టు అధికారులు తెలిపారు. ప్రమాదం నుంచి చాలామంది ఎలాంటి గాయాలు లేకుండా బయటపడినట్టు పేర్కొన్నారు. ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు. తిరగబడిన విమానం నుంచి ప్రయాణికులను రక్షిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.