Sudan: సూడాన్‌లో పారామిలిటరీ దళాల విధ్వంసం.. 114 మంది మృతి

గత రెండు రోజుల్లో2 శిబిరాలపై పారామిలిటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ కాల్పులు;

Update: 2025-04-13 05:00 GMT

పశ్చిమ సూడాన్‌లోని ఉత్తర డార్ఫర్ రాష్ట్ర రాజధాని ఎల్ ఫాషర్‌లో గత రెండు రోజుల్లో రెండు శిబిరాలపై పారామిలిటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (RSF) కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో 114 మందికి పైగా పౌరులు మరణించారు. ఏప్రిల్ 12న జామ్జామ్ శిబిరంపై ఆర్‌ఎస్‌ఎఫ్ మిలీషియా జరిపిన దారుణ దాడిలో 100 మందికి పైగా పౌరులు మరణించారు. డజన్ల కొద్దీ గాయపడ్డారు ని నార్త్ డార్ఫర్ రాష్ట్ర ఆరోగ్య అథారిటీ డైరెక్టర్ జనరల్ ఇబ్రహీం ఖైటర్ జిన్హువా తెలిపారు.

అబూ షౌక్ శిబిరంపై జరిగిన మరో మిలీషియా దాడిలో మరో 14 మంది పౌరులు మరణించారు. డజన్ల కొద్దీ గాయపడ్డారు అని ఆయన చెప్పారు.జిన్హువా ప్రకారం, జామ్జామ్ శిబిరంలో మరణించిన వారిలో శిబిరంలో ఫీల్డ్ హాస్పిటల్ నిర్వహిస్తున్న ప్రభుత్వేతర సంస్థ రిలీఫ్ ఇంటర్నేషనల్‌కు చెందిన తొమ్మిది మంది సిబ్బంది కూడా ఉన్నారని ఖాతిర్ వెల్లడించాడు. అబూ షౌక్ శిబిరంపై ఆర్‌ఎస్‌ఎఫ్ జరిపిన భారీ షెల్లింగ్ ఫలితంగా శనివారం 40 మంది పౌరులు మరణించారని, వందలాది మంది గాయపడ్డారని వాలంటీర్ గ్రూప్ ఎమర్జెన్సీ రూమ్ ఒక ప్రకటనలో తెలిపింది. దాడులకు సంబంధించి ఆర్‌ఎస్‌ఎఫ్ ఇంకా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. మే 10, 2024 నుండి, ఎల్ ఫాషర్‌లో సూడాన్ సాయుధ దళాలు (SAF), RSF మధ్య భీకర యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే.

Tags:    

Similar News