Donald Trump : పశ్చిమాసియాలో ఆరని మంటలు.. డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్

Update: 2024-12-03 12:15 GMT

ఇజ్రాయెల్‌-హమాస్‌ ల మధ్య యుద్ధంతో పశ్చిమాసియా అట్టుడుకుతోంది. తమ చెరలోని బందీలకు సంబంధించిన వీడియోను ఇటీవల హమాస్‌ విడుదల చేసింది. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్‌ ట్రంప్‌ మిలిటెంట్‌ సంస్థపై సీరియస్ అయ్యారు. తాను అధికార బాధ్యతలు చేపట్టకముందే వారిని విడిచిపెట్టాలని లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈమేరకు ఆయన ట్రూత్‌ సోషల్‌ వేదికగా పోస్ట్‌ చేశారు. తాను అమెరికా అధ్యక్షుడిగా 2025 జనవరి 20న బాధ్యతలు స్వీకరిస్తాను. ఈలోపు బందీలను విడుదల చేయాలి. లేకపోతే వారికి నరకం చూపిస్తాను సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. చరిత్రలో చూడని పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. వెంటనే బందీలను విడుదల చేయాలని హెచ్చరించారు.

ఇజ్రాయెల్‌పై ఒత్తిడి పెంచేందుకు హమాస్ మిలిటరీ విభాగమైన అల్‌ కస్సామ్‌ బ్రిగేడ్‌ ఓ వీడియోను విడుదల చేసింది. అమెరికా-ఇజ్రాయెల్‌ జాతీయుడైన 20 ఏళ్ల ఎడాన్‌ అలెగ్జాండర్‌ మాట్లాడారు. అందులో ‘తాను గత 420 రోజులుగా హమాస్‌ చెరలో బందీగా ఉన్నానని తెలిపారు. తామంత భయంతో రోజుకు వెయ్యిసార్లు చస్తున్నాం. మమ్మల్ని త్వరగా విడిపించండి’ అని అలెగ్జాండర్‌ అభ్యర్థించాడు. ఈ వీడియోపై బాధితుడి తల్లి స్పందించి.. ఎడాన్‌తో సహా బందీలందరి విడుదలకు ప్రధాని నెతన్యాహు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని కోరారు. ఈ టైంలో డొనాల్డ్‌ ట్రంప్‌ సీరియస్ అయ్యారు.

Tags:    

Similar News