అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్‌కు రిపబ్లికన్ పార్టీ లీడర్ నిక్కీ హేలీ షాక్ ఇచ్చారు. భారత్ లాంటి బలమైన మిత్ర దేశంతో సంబంధాలను దూరం చేసుకోవద్దని అన్నారు. భారత్ పై అధిక పన్నులు వేస్తానంటూ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో భారత సంతతి వ్యక్తి నిక్కీ హేలీ స్పందించారు. రష్యా నుంచి ఇండియా చమురు కొనుగోలు చేయకూడదు కానీ.. చైనా చేయొచ్చా అని ప్రశ్నించారు. రష్యా నుంచి చైనా అత్యధికంగా ఇంధనం కొనుగోలు చేస్తుందని.. అలాంటి దేశానికి మాత్రం సుంకాల నుంచి 90 రోజులు మినహాయింపు ఇచ్చారంటూ విమర్శించారు.
కాగా హేలీ గతంలో దక్షిణ కరోలినా గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ట్రంప్ మొదటిసారి ప్రెసిడెంట్ అయిప్పుడు ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారిగా పనిచేశారు. 2024లో అధ్యక్ష అభ్యర్థి రేసులో పోటీ చేసిన ఆమె..చివరకు ట్రంప్‌కు మద్దతు తెలిపారు.