పక్షి ఢీకొట్టడంతో మంటల్లో చిక్కుకున్న దుబాయ్ ఫ్లైట్
సోమవారం నేపాల్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన తర్వాత దుబాయ్ ఫ్లైట్ పక్షి దాడిని ఎదుర్కొంది.
సోమవారం నేపాల్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన తర్వాత దుబాయ్ ఫ్లైట్ పక్షి దాడిని ఎదుర్కొంది. దీంతో విమానం ఇంజన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన పైలెట్ విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు. నేపాల్‌లోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి టేకాఫ్ అయిన తర్వాత పక్షి ఢీకొట్టింది. దీంతో ఇంజన్‌లో మంటలు చెలరేగడంతో ప్రయాణీకులు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ విమానంలో 160 మందికి పైగా ప్రయాణీకులు ఉన్నారు. అందరూ సురక్షితంగా ప్రయాణీకులతో పాటు అధికారులూ ఊపిరి పీల్చుకున్నారు.
"ఫ్లై దుబాయ్ ఫ్లైట్ నంబర్ 576, (బోయింగ్ 737-800) ఖాట్మండు నుండి దుబాయ్‌కి వెళ్తోంది. విమానం టేకాఫ్ అవుతుండగా ఇంజన్‌లో ఒకదానిలో మంటలు చెలరేగడంతో ముందు జాగ్రత్త చర్యగా అగ్నిమాపక సిబ్బందిని విమానాశ్రయానికి పిలిపించారు. విమానం దుబాయ్‌లో సురక్షితంగా ల్యాండ్ అయినట్లు నేపాల్ టూరిజం మంత్రి సుడాన్ కిరాతి ధృవీకరించారు. విమానంలో మంటలు చెలరేగడం తాము చూశామని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు.
Fly Dubai flight number 576, (Boeing 737-800) Kathmandu to Dubai flight is normal now and proceeding to her destination Dubai as per the flight plan.
— Civil Aviation Authority of Nepal (@hello_CAANepal) April 24, 2023
Kathmandu airport operation normal from 1614 UTC (09:59pm local time). pic.twitter.com/RYhNONAXRK