Dubai Massage App: మసాజ్ పేరుతో నలుగురు మహిళలు అతడిని బంధించి..

Dubai Massage App: నాలుగు రాళ్లు వెనకేసుకుందామని ఉన్న ఊరిని వదిలి దేశం కాని దేశం దుబాయ్ వెళ్లాడు. ఆకాశాన్నంటుతున్న ఆ అందమైన హార్మాలు చూసి అచ్చెరువొందాడు. కొన్నేళ్లుగా కష్టపడి దాచుకున్న సొమ్మంతా మసాజ్ రూపంలో పోగొట్టుకున్నాడు. ఇప్పడు లబో దిబో మంటూ మొత్తుకుంటున్నాడు.

Update: 2021-02-22 10:26 GMT

Dubai Massage Centre

మహానగరంలో మాయగాళ్లు.. ఈ నలుగురు మహిళలు.. మసాజ్ పేరుతో దుబాయ్‌లో ఉంటున్న 33 ఏళ్ల భారతీయుడిని ముగ్గులోకి దించి అతడి దగ్గర నుంచి రూ.55,30,806లు దోచుకున్నారు. దుబాయ్‌లోని 33 ఏళ్ల భారతీయ వ్యక్తిని డేటింగ్ యాప్ ద్వారా నకిలీ మసాజ్ పార్లర్‌‌కు రప్పించారు నలుగురు మహిళలు. అనంతరం అతడి అకౌంట్‌లో నగదు మొత్తం వారి అకౌంట్లలోకి ట్రాన్సఫర్ చేయించుకున్నారు. ఈ విషయాన్ని గల్ఫ్ న్యూస్ తెలిపింది.

కోర్టు రికార్డుల ప్రకారం బాధితుడు 200 దిర్హామ్‌లకు (రూ .3,950) మసాజ్ సెషన్ అనే ఆఫర్‌ని చూసి సదరు కంపెనీకి కాల్ చేశారు. ఫలానా సమయానికి రమ్మంటూ ఓ అమ్మాయి వగలు పోతూ మాట్లాడేసరికి అబ్బాయి ఫ్లాటైపోయిడు. చెప్పిన సమయానికి 2020 నవంబర్‌లో దుబాయ్‌లోని అల్ రెఫా ప్రాంతంలోని అపార్ట్‌మెంట్‌కు వెళ్లాడు. అతన్ని ఒక రోజు అపార్ట్‌మెంట్‌లో నిర్బంధించి అతడి అకౌంట్‌లో ఉన్న నగదు మొత్తాన్ని ట్రాన్సఫర్ చేయించుకున్నారు. నలుగురూ ఆఫ్రికన్ మహిళలని బాధితుడు తెలిపాడు.

ఆ నలుగురు మహిళల్లో ఒకరు తన క్రెడిట్ కార్డు తీసుకొని 30,000 దిర్హామ్స్ (రూ .5,92,586) ను ఏటీఎం నుంచి ఉపసంహరించుకున్నారు. బాధితుడి బ్యాంక్ ఖాతా నుండి మహిళలు 250,000 దిరామ్‌లను బదిలీ చేయించుకున్నారు. అనంతరం "వారు నా ఐఫోన్‌ను తీసుకున్న తర్వాతే నన్ను అపార్ట్‌మెంట్ నుండి వెళ్లడానికి అనుమతించారు. నేను బ్యాంకును అప్రమత్తం చేసి సంఘటనను పోలీసులకు నివేదించాను అని బాదితుడు పేర్కొన్నాడు.

దుబాయ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ముగ్గురు నైజీరియా మహిళలను షార్జాలో అరెస్టు చేయగా, నాల్గవ మహిళ ఇంకా చిక్కలేదు అని తెలిపారు.

"వారిలో ఒకరు టిండెర్ అప్లికేషన్ ద్వారా బాధితురాలిని ఆకర్షించడం, మసాజ్ సేవలను అందించడం వంటివి చేస్తుంటారు. వారు బాధితుడిని అపార్ట్‌మెంట్ లోపల బంధించి, అతని ఖాతా నుండి డబ్బును తీసుకుని దేశం వెలుపల ఉన్న వేర్వేరు ఖాతాలకు బదిలీ చేశారు.

ముగ్గురు నైజీరియా ముద్దాయిలపై దోపిడీ, బెదిరింపులు, బాధితుడిని బలవంతంగా నిర్బంధించడం, వ్యభిచారం చేయడం వంటి అభియోగాలు మోపుతూ అరెస్ట్ చేశారు.  

Tags:    

Similar News