ఆఫ్ఘనిస్తాన్ లో తెల్లవారుజామున భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 5.9 తీవ్రతతో భూవి కంపించింది. భూకంప కేంద్రం ఉపరితలం నుంచి 121 కిలోమీటర్ల లోతులో ఉన్నట్టు తెలిపింది. హిందూ కుష్ ప్రాంతంలో బఘ్లాన్ నగరానికి 164 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్టు తెలిపింది. అఫ్గన్‌పై తరుచూ భూకంపాలు విరుచుకుపడి.. అపార ప్రాణ, ఆస్తినష్టం కలిగిస్తుంటాయి. ఆఫ్గన్‌లో భూకంప ప్రభావంతో భారత్‌లోనూ పలు చోట్ల ప్రకపంపనలు నమోదయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలో భూమి కంపించింది.
ఇటీవల మయన్మార్, థాయలాండ్‌లో వచ్చిన భూకంపాలు పెను విధ్వంసం సృష్టించింది. మార్చి 28న మయన్మార్‌లో సంభవించిన భూకంపానికి దాదాపు 4 వేల మంది ప్రాణాలు కోల్పోగా.. వేల మంది గాయపడ్డారు. అపార ఆస్తినష్టం జరిగింది. అప్పటి నుంచి దాదాపు 470 వరకూ ప్రకపంపలు చోటుచేసుకున్నాయి. ఏప్రిల్ 13న భారత్‌తో పాటు మయన్మార్, తజకిస్థాన్‌లో గంట వ్యవధిలోనే నాలుగు భూకంపాలు వచ్చినట్టు నేషనల్ సిస్మాలజీ సెంటర్ తెలిపింది.