యావత్ ప్రపంచాన్ని అబ్బురపరచిన 8 నెలల గర్భిణి..!
అమినాత్ ఇద్రిస్ అనే 26 ఏళ్ల తైక్వాండో ప్లేయర్.. స్థానిక స్పోర్ట్స్ ఫెస్టివల్‌లో భాగంగా నిర్వహించిన పోటీల్లో... మిక్స్‌డ్ ఫూమ్స్ కేటగిరీలో గోల్డ్ మెడల్ గెలుచుకుంది.;
గర్భిణిగా ఉన్నప్పుడు మహిళలు రోజువారీ పనులు చేసుకోవడమే కష్టంగా ఉంటుంది. అలాంటిది నైజీరియాకు చెందిన ఓ మహిళ 8 నెలల నిండు గర్భంతో... తైక్వాండో పోటీల్లో పాల్గొనడమే కాకుండా ఏకంగా స్వర్ణపతకం గెలుచుకుంది. అమినాత్ ఇద్రిస్ అనే 26 ఏళ్ల తైక్వాండో ప్లేయర్.. స్థానిక స్పోర్ట్స్ ఫెస్టివల్‌లో భాగంగా నిర్వహించిన పోటీల్లో... మిక్స్‌డ్ ఫూమ్స్ కేటగిరీలో గోల్డ్ మెడల్ గెలుచుకుంది. దీంతోపాటు మరో మూడు విభాగాల్లోనూ పతకాలు సాధించింది అమినాత్. మహిళల్లో ఉన్న శారీరక, మానసిక బలానికి అమినాత్ నిదర్శనమని క్రీడా ప్రముఖులు ప్రశంసిస్తున్నారు.