Elon Musk : ఉక్రెయిన్‌కు అండగా నిలిచిన ఎలన్‌ మస్క్‌

Elon Musk : స్టార్‌ లింక్‌ శాటిలైట్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలను ప్రారంభించి నిరంతరాయంగా ఇంటర్నెట్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారు.;

Update: 2022-02-27 10:00 GMT

Elon Musk : రష్యా దాడితో ఉక్కిరిబిక్కిరవుతున్న ఉక్రెయిన్‌కు అండగా నిలిచారు ఎలన్ మస్క్. స్టార్‌ లింక్‌ శాటిలైట్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలను ప్రారంభించి నిరంతరాయంగా ఇంటర్నెట్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారు. మరిన్ని టెర్మినల్స్ కూడా ప్రారంభిస్తామన హామీ ఇచ్చారు.

రష్యా దాడులు ప్రారంభమైన తర్వాత ఉక్రెయిన్‌లో ఇంటర్నెట్ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రస్తుత సమయంలో ప్రజలకు అత్యవసర సమాచారం చేరవేయాలంటే ఇంటర్నెట్ అత్యవసరం. ఇంటర్నెట్‌ అందుబాటులో లేకపోతే ప్రజలు గందరగోళానికి గురయ్యే ప్రమాదం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉక్రెనియన్లకు అండగా నిలిచారు మస్క్. దీనిపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురుస్తోంది.

అంతకుముందు ఉక్రెయిన్ డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌ శాఖ మంత్రి మైఖైలో ఫెదొరోవ్...స్టార్‌లింక్‌ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని మస్క్‌కు విజ్ఞప్తి చేశారు. ఫెదొరోవ్‌ ట్వీట్‌ చేసిన పది గంటల్లోనే ఉక్రెనియన్లకు నిరంతరాయంగా ఇంటర్నెట్ అందే విధంగా చర్యలు తీసుకున్నారు మస్క్.

Tags:    

Similar News