అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పై మరోసారి హత్యాయత్నం ఘటనపై ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ స్పందించారు. డెమోక్రాట్ నేతలపై విమర్శలు గుప్పించారు. 'అమెరికా అధ్యక్షుడు బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ను హత్య చేసేందుకు ఎవరూ ప్రయత్నించట్లేదు' అంటూ ఎక్స్ లో పోస్టు చేశారు.
ట్రంప్ ఎందుకు హత్యచేసేందుకు యత్నిస్తున్నారని ఓ యూజర్ చేసిన పోస్టుపైన మస్క్ ఇలా స్పందించారు. మరోవైపు, ఇప్పటికే అమెరికా ఎన్నికల్లో ట్రంప్నకు పూర్తి మద్దతని మస్క్ ప్రకటించారు.