Bruce Lee: బ్రూస్ లీ ద లెజెండ్... మరణించి 50 ఏళ్లైనా..
బ్రూస్‌లీ 50వ వర్ధంతి సందర్భంగా అభిమానుల నివాళీ
మార్షల్ ఆర్ట్స్ ఈ పేరు వినగానే ఎవరికైనా వెంటనే గుర్తుచ్చే పేరు బ్రూస్ లీ(Bruce Lee). తన మార్షల్ ఆర్ట్స్‌తో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు లీ. కోట్ల మంది అభిమానులను శోకసంద్రంలో ముంచుతూ బ్రూస్ లీ అతి చిన్న వయసులోనే లోకాన్ని వీడాడు. ప్రపంచ మార్షల్ ఆర్ట్ లెజెండ్( kung fu legen) గా ఖ్యాతినార్జించిన ఈ వీరుడు మరణించి జులై 20కు 50 వసంతాలు50th anniversary of Bruce Lee's death) పూర్తయింది. అయినా నేటికీ మార్షల్ అంటే బ్రూస్ లీ... బ్రూస్ లీ అంటే మార్షల్ అనే పేరు మాత్రం ప్రపంచవ్యాప్తంగా వినపడుతూనే ఉంది.
బ్రూస్ లీ మరణించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన అశేష అభిమానులు హాంకాంగ్(Hong Kong) చేరుకుని నివాళులు అర్పించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు సహా చైనా, ఆసియా, ఐరోపా దేశాల నుంచి అభిమానులు తరలివచ్చి బ్రూస్‌లీ విగ్రహం ముందు మార్షల్ ఆర్ట్స్ చేస్తూ ఆ లెజెండ్‌కు నివాళులు అర్పించారు.
హాంకాంగ్‌లోని విక్టోరియా హార్బర్‌లోని బ్రూస్‌లీ కాంస్య విగ్రహం( Bruce Lee bronze statue) ముందు ఆయనకు నమస్కరిస్తూ.. పుష్పగుచ్చాలు విగ్రహం ముందు ఉంచుతూ నివాళులు అర్పించారు. నాన్‌చాక్ విన్యాసాలను ప్రదర్శించారు. తమకు చిన్నప్పటి నుంచి బ్రూస్ లీనే ఆదర్శమని ఆయన అభిమానులు చెప్పారు.
18 ఏళ్ల వయసులో హాంకాంగ్ చా చా ఛాంపియన్ షిప్ గెలిచాడు బ్రూస్‌లీ. 100 డాలర్లతో అమెరికా షిప్ ఎక్కేశాడు. సియాటెల్‌లో కుంగ్‌పూ నేర్పిస్తూ వచ్చిన డబ్బుతో ఫిలాసఫీ చదువుకున్నాడు. ప్రపంచంలో మిక్స్ మార్షల్ ఆర్ట్స్‌ను తొలుత ప్రారంభించాడు. అతడి కంటే గొప్ప ఫైటర్లు చాలామందే ఉండొచ్చు. కానీ ప్రతిఒక్కరికీ అతడే స్ఫూర్తి. కొట్టే ప్రతి పంచ్ వెనుక ఓ థియరీ చెబుతాడు. అతడిలోని ఫిలాసఫీకి అందరూ ఫిదా అవుతారు. అతిచిన్న వయసులో 32 ఏళ్లకే బ్రూస్‌లీ మరణించాడు. ప్రపంచంలోని ప్రతీ చిన్న పల్లెలోనూ బ్రూస్‌లీ పేరు తెలుసు.
బ్రూస్ లీకి ఒక కుమారుడు, కూతురు ఉన్నారు. ఆయన కుమారుడు బ్రాండన్ బ్రూస్ లీ కూడా 1993లో మరణించాడు. కూతురు షానన్ లీ మాత్రమే బ్రూస్ లీ కుటుంబం నుంచి బతికి ఉన్నారు. బ్రూస్ లీ మరణం తర్వాత అతని భార్య లిండా మరోక వ్యక్తిని వివాహం చేసుకున్నారు. ఆమె ఆమెరికాలో ప్రముఖ వ్యాపారవేత్త, సినీ నిర్మాతగా కొనసాగుతున్నారు. త్వరలో తన తండ్రి గురించి బయోపిక్ తీసేందుకు ప్లాన్ చేస్తున్నారు.