Donald Trump : ట్రంప్ సీరియస్ వార్నింగ్.. యుద్ధం మరింత భయానకం..?

Update: 2026-03-03 07:00 GMT

ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్-అమెరికా యుద్ధం భీకరంగా సాగుతోంది. ఇరాన్ లో ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడులు చేస్తున్నాయి. అయితే ఇరాన్ కూడా అదే స్థాయిలో ప్రతి దాడులు చేస్తోంది. సుప్రీంలీడర్ ఖమేనీ మృతికి ప్రతీకారంగా దాడులు చేస్తున్నామని.. బదులు తీర్చుకుంటామని ఇరాన్ తేల్చి చెప్పింది. అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ భీకర దాడులు చేస్తోంది. ఈ దాడులపై ట్రంప్ సీరియస్ అయ్యారు. ఇరాన్ వెంటనే ప్రతిదాడులు ఆపేయాలన్నారు. కానీ ఇరాన్ తగ్గట్లేదు. దీంతో ట్రంప్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ మీద మరింత భీకర దాడులు చేస్తామని.. ఇరాన్ ప్రజలెవరూ బయటకు రావొద్దని హెచ్చరించారు. తమ మాట వినకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ట్రంప్ హెచ్చరించారు. ట్రంప్ వార్నింగ్ ఇచ్చిన కొద్ది సేపటి నుంచే అమెరికా బలగాలు మరింత భీకరంగా ఇరాన్ మీద దాడులు చేస్తున్నాయి.

ఈ దాడుల్లో ఇరాన్ లో చాలా చోట్ల భయానక పరిస్థితులు కనిపిస్తున్నాయి. అటు ఇజ్రాయెల్ కూడా దాడులను ముమ్మరం చేసింది. ఈ రెండు దేశాల చేస్తున్న దాడులతో ఇరాన్ రణరంగంగా మారిపోయింది. అటు గల్ఫ్ దేశాలు కూడా ఇరాన్ దాడులపై సీరియస్ అవుతున్నాయి. ఇరాన్ వెంటనే దాడులు ఆపేయాలని.. లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నాయి. కానీ ఇరాన్ ప్రస్తుతం ఎవరినీ పట్టించుకునే స్థితిలో లేనట్టే ఉంది.

నిన్ననే అమెరికాతో చర్చలకు తాము సిద్ధమని ఇరాన్ ప్రకటించింది. అటు ట్రంప్ కూడా సానుకూలంగానే స్పందించారు. కానీ యుద్ధ వాతావరణం మాత్రం క్షణ క్షణం భయానకంగా మారుతోంది. సామాన్య జనాల ప్రాణాలు పిట్టల్లా రాలిపోతున్నాయి. ఇప్పటికే ఇరాన్ లో వెయ్యి మందికి పైగా సామాన్య జనాలు చనిపోయినట్టు తెలుస్తోంది. ఇంకొన్ని వారాల పాటు యుద్ధం ఉంటుందని ట్రంప్ చెప్పిన నేపథ్యంలో.. అప్పటి వరకు పరిస్థితులు ఎలా ఉంటాయో ఊహించడానికే భయంకరంగా మారిపోయింది.

Tags:    

Similar News