ఇండోనేసియా లోని బాలి సమీపంలో 65 మందితో ప్రయాణిస్తున్న ఫెర్రీ సముద్రం లో మునిగిపోయింది. వీరిలో నలుగురు మృతి చెందగా.. 38 మంది గల్లంతయ్యారు. తూర్పు జావాలోని కేటాపాంగ్ పోర్టు నుంచి బాలి లోని గిలిమనుక్కు ఈ ఫెర్రీ వెళ్తుంది. బయలుదే రిన 30 నిమిషాలకే ఈ ప్రమాదం జరిగింది. ఇందులో 53 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందితో పాటు 22 వాహనాలు, 142 ట్రక్కులు కూడా ఉన్నాయి. రెస్క్యూ సిబ్బంది అక్కడికి చేరుకొని సహాయక చర్యలు ప్రారం భించారు. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. 23 మందిని రక్షించారు. మిగిలిన వారిని రక్షించేందుకు అధికారులు సహాయకచర్యలు కొనసాగిస్తున్నారు. పెద్దఎత్తున అలలు వస్తుండటంతో సహాయక చర్యలకు ఇబ్బందు లు తలెత్తుతున్నాయి. ఇండోనేసియాలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లడానికి ఫెర్రీలు, పడవలనే ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే, భద్రతా ప్రమాణాలు సరిగా పాటించ కపోవడం, సామర్థ్యానికి మించి ఎక్కించడం వంటి కారణాలతో తరచూ ఇక్కడ ప్రమాదాలు జరుగుతుంటాయి.