Fire in Ferry: నడి సముద్రంలో షిప్‌లో భారీగా మంటలు.. 280కి పైగా ప్రయాణికులు..

280 మంది ప్రయాణికులు.. పిల్లలతో కలిసి దూకేశారు..;

Update: 2025-07-21 04:45 GMT

ఇండోనేషియా తీరంలో ప్రయాణిస్తున్న ఫెర్రీ(ఓడ)లో మంటలు చెలరేగాయి. భయాందోళనకు గురైన ప్రయాణికులు సముద్రంలోకి దూకారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓడ పూర్తిగా మంటల్లో చిక్కుకుంది. ఆకాశంలో నల్లటి పొగ ఎగసిపడుతోంది. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించగా, 18 మంది గాయపడినట్లు సమాచారం. ప్రమాదానికి గురైన ఓడ పేరు KM బార్సిలోనా VA. ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే.. రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయి.. స్థానిక మత్స్యకారుల సాయంతో సహాయక చర్యలు చేపట్టాయి. ప్రయాణికులు, సిబ్బంది సహా 284 మందిని రక్షించినట్లు అధికారులు వెల్లడించారు. ఘటన సమయంలో నౌకలో మొత్తం ఎంతమంది ఉన్నారు? గాయపడిన వారెందరు? అనే విషయాలపై స్పష్టత లేదు.

అయితే.. ఇండోనేషియాలోని తలౌడ్‌ నుంచి ఉత్తర సులవేసి ప్రావిన్సు రాజధాని మనాడోకు ఈ ఫెర్రీ బయలుదేరినట్లు చెబుతున్నారు. తలిసే ప్రాంతానికి చేరుకుంది. అక్కడ అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. భయాందోళనకు గురైన ప్రయాణికులు, కొందరు తమ పిల్లలతో కలిసి మంటల నుంచి తప్పించుకోవడానికి సముద్రంలోకి దూకుతున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. సేఫ్టీకి జాకెట్‌లు ఉండటంతో చాలా మంది బతికి బయటపడ్డారు. లేదంటే.. నీటిలో మునిగి మృత్యువాత పడేవారు.

అబ్దుల్ రహమద్ అగు అనే ప్రయాణీకుడు ఈ ప్రమాదాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశాడు. నీటిలో ఉన్న అతడి చేతిలో ఏడుస్తున్న పిల్లాడు ఉన్నాడు. అలాగే నీటిలో నిలబడి వీడియో తీశాడు. “మాకు సాయం చేయండి, KM బార్సిలోనా ఫెర్రీ మంటల్లో చిక్కుకుంది. అందులో చాలామంది ఉన్నారు. మేము సముద్రంలో కాలిపోతున్నాము, మాకు త్వరగా సాయం కావాలి” అని అతడు వేడుకోవడం ఆ వీడియోలో ఉంది.

సమాచారం అందిన వెంటనే ఇండోనేషియా నావికాదళం వెంటనే మూడు నౌకలను సహాయక చర్యలను ప్రారంభించడానికి పంపింది. స్థానిక మత్స్యకారులు కూడా సహాయక చర్యల్లో చురుకుగా పాల్గొన్నారు. తాజా నివేదికల ప్రకారం దాదాపు 150 మందిని రక్షించారు. 130 మంది జాడ లేకుండా పోయారు.

ఫెర్రీలో మంటలకు కారణం ఇంకా తెలియలేదు. మూడవ డెక్‌లో మంటలు ప్రారంభమై త్వరగా ఫెర్రీ అంతటా వ్యాపించినట్లు భావిస్తున్నారు. ఈ ఘోర ప్రమాదం.. ఇండోనేషియాలోని ఫెర్రీస్ లో ప్రయాణికుల భద్రతపై మరింత శ్రద్ధ వహించాల్సిన అవసరాన్ని తెలుపుతుంది.

Tags:    

Similar News