Germany lockdown : జర్మనీలో లాక్ డౌన్... వారికి మినహాయింపు..!

Germany lockdown : ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తోంది. కేసులు భయటపడుతుండడంతో కొన్ని దేశాలు లాక్ డౌన్ వైపు మొగ్గుచూపుతున్నాయి.

Update: 2021-12-03 01:46 GMT

Germany lockdown : ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తోంది. కేసులు భయటపడుతుండడంతో కొన్ని దేశాలు లాక్ డౌన్ వైపు మొగ్గుచూపుతున్నాయి. అందులో భాగంగానే యూరప్ దేశమైన జర్మనీలో లాక్ డౌన్ విధించారు. అయితే టీకా తీసుకున్నవారికి లాక్ డౌన్ నుంచి మినహాయింపు ఉంటుందని, తీసుకొని వారు బయటకు వెళ్ళడానికి వీల్లేదని అక్కడి ప్రభుత్వం ఆంక్షలు విధించింది.

జర్మనీలో వ్యాక్సినేషన్ ను తప్పనిసరి చేసేందుకు ఓ చట్టం తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. అక్కడ ఇప్పటివరకు కేవలం 68.7% మాత్రమే టీకాలు వేయించుకున్నారు. అక్కడి జనాభాతో పోలిస్తే ఇది చాలా తక్కువ. అటు ఆస్ట్రియాలో కూడా డిసెంబర్ 11వరకు లాక్ డౌన్ విధించారు. గ్రీస్, డెన్మార్క్, యూకే, పోర్చుగల్ లాంటి దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి.

ఇదిలావుండగా తాజాగా ఇండియాలో రెండు ఓమిక్రాన్ కేసులు వెలుగులోకి వచ్చాయి. ఈ రెండు కేసులు కర్ణాటక రాష్ట్రంలో నమోదయ్యాయి.

Tags:    

Similar News