Gita Gopinath: మూడేళ్లలో డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్.. ఐఎమ్ఎఫ్‌లో భారత మహిళ రికార్డ్..
Gita Gopinath: ఇండియన్స్ టాలెంట్‌ను పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవడంలో అంతర్జాతీయ సంస్థలు ఎప్పుడూ గురితప్పవు.;
Gita Gopinath (tv5news.in)
Gita Gopinath: ఇండియన్స్ టాలెంట్‌ను పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవడంలో అంతర్జాతీయ సంస్థలు ఎప్పుడూ గురితప్పవు. ఇటీవల ట్విటర్ సీఈఓగా పరాగ్ అగర్వాల్‌ను నియమించింది. పరాగ్‌కు కేవలం అందులో పదేళ్ల అనుభవం మాత్రమే ఉంది. అయినా మిగతా ఉద్యోగుల్లో లేని టాలెంట్‌ను, సత్తాను పరాగ్‌లో చూడగలిగింది ట్విటర్. అందుకే తనకు సీఈఓగా గౌరవాన్ని అందించింది. తాజాగా మరో అంతర్జాతీయ సంస్థ ఓ ఇండియన్ మహిళను అత్యున్నత పదవితో సత్కరించింది.
ఐఎమ్ఎఫ్ (ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్) అంటే అంతర్జాతీయ ద్రవ్య నిధి.. ఈ సంస్థ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గురించి స్టడీ చేస్తుంటుంది. ఇప్పటివరకు ఇందులో గీతా గోపీనాథ్ అనే భారతీయ మహిళ ప్రధాన ఆర్థికవేత్తగా పనిచేస్తోంది. ఇటీవల ఆమెకు ఐఎమ్ఎఫ్‌లోనే రెండో స్థానాన్ని అందించింది. ప్రస్తుతం తనను 'డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్'గా సంస్థ ప్రమోట్ చేసింది. ఈ పదవిని గీతాకు అందించడం చాలా అనూహ్యం.
త్వరలోనే ప్రధాన ఆర్థికవేత్తగా గీతా గోపీనాథ్ పదవీకాలం ముగియనుంది. అయితే తాను కోవిడ్ 19 సమయంలో ఐఎమ్ఎఫ్ కోసం గీతా చాలా కష్టపడిందట. అందుకే తనను వదులుకోవడం ఇష్టం లేక తన పదవికాలాన్ని పొడగించడంతో పాటు డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా ప్రమోట్ చేశారు కూడా. ఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టలినా జార్జియేవా.. గీతా గోపీనాథ్‌లో కష్టపడే తత్వం ఉందని తాను ఈ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా పదవిని స్వీకరించడం సంతోషమని అన్నారు.
కోలకత్తాలో పుట్టిన గీతా గోపీనాథ్.. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ఎమ్.ఏ ఎకనామిక్స్ చేశారు. ఐఏఎస్ చదవాలనుకున్నా గీతా.. వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలో మరోసారి ఎమ్ ఏ ఎకనామిక్స్ చదివే అవకాశం రాడంతో అమెరికా బాటపట్టారు. ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయంలో పీహెయచ్‌డీ పూర్తి చేశారు. తర్వాత షికాగో విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరారు. ఆ తర్వాత కొంతకాలం హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో పూర్తిస్థాయి ప్రొఫెసర్‌గా పనిచేశారు. 2018లో ఐఎమ్ఎఫ్‌లో సాధారణ ఉద్యోగిగా చేరిన గీతా గోపీనాథ్.. ప్రస్తుతం ఆ సంస్థకు డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా సేవలు అందించనున్నారు.