అమెరికా పౌరసత్వం కావా లనుకునే సంపన్నులు గోల్డ్ కార్డు కొనుగోలు చేయొచ్చని ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటించిన విషయం విదితమే. తాజాగా ఆ గోల్డ్ కార్డ్ ఫస్ట్ లుక్ను ఆయన విడుదల చేశారు. ఎయిర్ ఫోర్స్ వన్లో విలేకరులతో మాట్లాడే సమయంలో ఆయన దీన్ని చూపించారు. ఈ గోల్డ్ కార్డును 5 మిలియన్ డాలర్లతో ఎవరైనా సొంతం చేసుకోవచ్చన్నారు. తానే దీనిని మొదట కొనుగోలు చేసినట్లు ప్రకటించారు. ఈబీ5 వీసా విధానాన్ని రద్దు చేసి 50 లక్షల డాలర్లు వెచ్చించే వారికి ఈ గోల్డ్ కార్డు అందిస్తామని ఇటీవల ట్రంప్ ప్రకటించారు. దీన్ని కొనుగోలు చేసినవారికి నేరుగా అమెరికా పౌరసత్వాన్ని అందజేస్తారు. ప్రపంచవ్యాప్తంగా సంపన్నులను ఆకర్షించేందుకే దీనిని ప్రవేశపెట్టామని, వారు అమెరికాకు వచ్చి భారీగా ఖర్చు పెడితే స్థానికంగా ఉద్యోగాలు పెరుగుతాయని ట్రంప్ పేర్కొన్నారు. ఈ కార్డుకు భారీగా గిరాకీ వచ్చిందని, ఒక్కరోజే 1000 కార్డులను విక్రయించినట్లు వాణిజ్యశాఖ మంత్రి హోవర్డ్ లుట్నిక్ ఇటీవల తెలిపారు. వీటిద్వారా 5 బిలియన్ డాలర్లు సేకరించామన్నారు. ప్రపంచవ్యాప్తంగా 3.7 కోట్ల మందికి ఈ కార్డు కొనే సామర్థ్యం ఉందన్నారు. అమెరికా ఈబీ5 వీసా విధానాన్ని 1990లో తీసుకొచ్చింది. వే లాదిమంది ఈ ఇన్వెస్టర్ వీసాలను పొందారు. ఈ విధానంతో మోసాలు జరుగుతున్నాయని, కొందరు అక్రమంగా నిధులు పొందుతున్నారని ఇటీవల జరిపిన అధ్యయనంలో తేలింది. దీంతో 2022లో కొన్ని సవరణలు చేశారు. ఇప్పుడు దాని స్థానంలో గోల్డ్ కార్డును ట్రంప్ ఇంట్రడ్యూస్ చేశారు.