Jammu Kashmir: తీవ్రవాదిగా మారిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు.. పోలీసులు అరెస్ట్

Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్ పోలీసులు తీవ్రవాదిగా మారిన ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిని అరెస్టు చేశారు.

Update: 2023-02-02 11:23 GMT

Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్ పోలీసులు తీవ్రవాదిగా మారిన ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిని అరెస్టు చేశారు. అతని వద్ద నుండి పెర్ఫ్యూమ్ ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (IED)ని స్వాధీనం చేసుకున్నారు. జనవరి 21న జమ్మూలోని నర్వాల్ ప్రాంతంలో జరిగిన జంట పేలుళ్ల ఘటనలో 9 మంది గాయపడిన ఘటనపై విచారణ జరుపుతున్న పోలీసులు రియాసి జిల్లాకు చెందిన ఆరిఫ్‌ను అరెస్టు చేశారు.

నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాతో ఆరిఫ్‌కు సంబంధాలు ఉన్నాయని జమ్మూ కాశ్మీర్ పోలీస్ డైరెక్టర్ జనరల్ దిల్బాగ్ సింగ్ తెలిపారు. అతని వద్ద నుంచి పెర్ఫ్యూమ్ బాటిల్‌లో అమర్చిన ఐఈడీని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

కేంద్రపాలిత ప్రాంతంలో ఇలాంటి బాంబును స్వాధీనం చేసుకోవడం ఇదే తొలిసారి అని జమ్మూ కాశ్మీర్ పోలీసు చీఫ్ చెప్పారు. ఎవరైనా నొక్కడానికి లేదా తెరవడానికి ప్రయత్నిస్తే IED పేలుతుంది అని ఆయన చెప్పారు. 

ఆరిఫ్ తన పాకిస్థానీ హ్యాండ్లర్ల ఆదేశానుసారం పనిచేస్తున్నాడని పోలీస్ అధికారి తెలిపారు. గత మేలో వైష్ణో దేవి యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సుపై బాంబు దాడి చేయడంతో నలుగురు వ్యక్తులు మరణించారు, 24 మంది గాయపడ్డారు అని సింగ్ తెలిపారు.

పాకిస్తాన్ "ఉగ్రవాదాన్ని ప్రచారం చేయడంలో అపఖ్యాతి పాలైంది". రాష్ట్రంలోని ప్రజల మధ్య "మత విభజన" సృష్టించాలని కోరుకుంటున్నట్లు జమ్మూ కాశ్మీర్ సీనియర్ పోలీస్ అధికారి అన్నారు.

Tags:    

Similar News