Hamas: ఇంకా సజీవంగా ఉన్న హమాస్ అధినేత యహ్యా సిన్వార్
సెప్టెంబర్ 21 దాడిలో చనిపోయినట్లు అనుమానం;
హమాస్ అధినేత యహ్యా సిన్వార్ సజీవంగానే ఉన్నట్లు తెలుస్తోంది. అక్టోబరు 7నాటి దాడుల్లో కీలక పాత్ర పోషించిన సిన్వార్ ఇజ్రాయెల్ దాడుల్లో మృతి చెందినట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే, ఆయన బతికే ఉన్నట్లు మీడియా కథనాలు వెలువడుతున్నాయి. ఆయన ఖతర్‌తో రహస్య సంబంధాలను ఏర్పర్చుకుంటున్నారని తెలుస్తోంది. ఇజ్రాయెల్‌కు చెందిన పలు మీడియా కథనాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. హమాస్ అధినేత యహ్యా సిన్వార్ సజీవంగా ఉన్నారని ఓ సీనియర్ ఖతర్ దౌత్యవేత్త తన సోషల్ మీడియాలో పోస్టు చేసినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి.
హమాస్ అధినేత యహ్యా సిన్వార్ సజీవంగా ఉన్నారని ఓ సీనియర్ ఖతర్ దౌత్యవేత్త తన సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేసినట్లు మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. అయితే ఆయన చుట్టూ ఇజ్రాయెల్ బందీలను తనకు రక్షణ కవచంగా ఉంచుకున్నట్లు ఖతర్ అధికారులు గతంలో పేర్కొన్నట్లు అందులో ఉంది.
గత నెల 21న ఇజ్రాయెల్ హమాస్ కమాండ్ సెంటర్ లక్ష్యంగా భీకర దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ దళాలు తెలిపాయి. వీటిల్లో సిన్వార్ మృతిచెంది ఉంటారని అవి భావించాయి. ఈక్రమంలో ఆయన నుంచి ఎలాంటి ప్రకటనలు వెలువడకపోవడంతో అవి మరింత బలపడ్డాయి. ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 22 మంది మృతి చెందినట్లు పాలస్తీనా ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై దాడులకు సూత్రధారి అయిన సిన్హార్.. ఈ ఏడాది ఆగస్టులో హమాస్ అధినేతగా నియమితులయ్యారు.