Hormuz Strait: హర్మూజ్ జలసంధి వద్ద నిలిచిన 15 భారత నౌకలు

ఎల్‌ఎన్‌జీ, ఎల్పీజీ క్వారియర్లు, క్రూడాయిల్‌ ట్యాంకర్లతో పాటు ఓ కెమికల్‌ కంటైనర్‌ కూడా

Update: 2026-04-13 09:30 GMT

హర్మూజ్ జలసంధి మీదుగా భారత్ రావాల్సిన 15 భారతీయ నౌకలు ప్రస్తుతం అక్కడే చిక్కుకుపోయాయి. హర్మూజ్‌ను పూర్తిగా దిగ్బంధిస్తామని అమెరికా హెచ్చరించడంతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు రాజుకున్నాయి. ఈ క్రమంలో అక్కడ వివిధ దేశాలకుచెందిన నౌకలు నిలిచిపోయాయి. భారత్‌కు చెందిన 15 నౌకల్లో ఎక్కువగా ఎల్ఎన్జీ, ఎల్పీజీ క్యారియర్లు, క్రూడాయిల్ ట్యాంకర్లతో పాటు ఒక కెమికల్ కంటైనర్ ఉందని తెలుస్తోంది.

హర్మూజ్‌లో నిలిచిపోయిన వాణిజ్య నౌకలతో సమన్వయం చేసుకునేందుకు భారత నౌకాదళం ప్రయత్నిస్తోంది. ఇందుకోసం నౌకాదళానికి చెందిన ఆరు ఓడలు ప్రస్తుతం పర్షియన్ గల్ఫ్ సమీపంలో మోహరించాయి. మన నౌకలను సురక్షితంగా హర్మూజ్ జలసంధిని దాటించేందుకు ఇవి సాయపడనున్నాయి. ఈ జలసంధి మార్గంలో మొత్తం 25 భారత నౌకలు ఉన్నాయి. అయితే అప్పటికే పది నౌకలు ఈ జలసంధిని దాటాయి.

ఇరాన్ ఓడరేవులను సోమవారం నుంచి దిగ్బంధిస్తామని యూఎస్ సెంట్రల్ కమాండ్ ప్రకటించడం తెలిసిందే. హర్మూజ్ మీదుగా నౌకల రవాణాను నిలిపివేయనప్పటికీ అగ్రరాజ్యం ప్రకటనతో ఈ జలసంధిలో నౌకల రవాణా నెమ్మదించింది. నౌకల రాకపోకల అకస్మాత్తుగా తగ్గినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.

Tags:    

Similar News