భార్యకు ప్రేమతో.. 50వ పెళ్లి రోజు గిప్ట్..
పెళ్లవ్వక ముందు ప్రతి అకేషనూ గుర్తుంటుంది.. కానీ పెళ్లైన తరువాత పెళ్లి రోజు కూడా మర్చి పోయే మహానుభావులు ఉన్నారు
పెళ్లవ్వక ముందు ప్రతి అకేషనూ గుర్తుంటుంది.. కానీ పెళ్లైన తరువాత పెళ్లి రోజు కూడా మర్చి పోయే మహానుభావులు ఉన్నారు.. పెళ్లవ్వకు ముందు ఉన్నంత ప్రేమ, పెళ్లైన తరువాత తగ్గిపోతుంది.. ప్చ్.. దానికి కారణాలు అనేకం.. కానీ పెళ్లై 50 ఏళ్లైనా వాడని కుసుమంలా ఉంది వారి బంధం.. అందుకే తన ప్రియమైన భార్యకు మర్చిపోలేని బహుమతి ఇవ్వాలనుకున్నారు. ఆమెకు ఇష్టమైన ప్రొద్దుతిరుగుడు పువ్వు ఒకటి, రెండు కాదు ఏకంగా 80 ఎకరాల్లో పండించిన 12 లక్షల పొద్దుతిరుగుడు పువ్వులను అందించారు.. అనంతరం ఆతోటలో విహరించారు.. పెళ్లినాటి సంగతులను నెమరువేసుకున్నారు..
50వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్యకు '1.2 మిలియన్ సన్‌ఫ్లవర్స్' ని బహుమతిగా ఇచ్చిన భర్త. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక US రైతు వారి 50వ వివాహ వార్షికోత్సవానికి ముందు తన భార్య కోసం 80 ఎకరాల్లో పొద్దుతిరుగుడు విత్తనాలు నాటాడు. మొక్కలు పెరిగి వాటికి పువ్వులు విరగకాసాయి. వికసించిన పొద్దుతిరుగుడు పువ్వుల మధ్యలో నిలబడి ఇది నేను నీకు ఇచ్చే ప్రేమ కానుక అని చెప్పాడు.. దాంతో అతడి భార్య ఆనందానికి అవధులు లేవు. ఇది కదా సరైన వార్షికోత్సవ కానుక అని భార్య ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యింది.
ప్రేమ అనేది వ్యక్తులను విచిత్రమైన పనులు చేసేలా ప్రోత్సహించే ఒక ఎమోషన్ అని అంటారు. లీ విల్సన్ USకు చెందిన ఓ రైతు. తన భార్య రెనీ పట్ల తన ప్రేమను ప్రదర్శించడానికి 80 ఎకరాలలో పొద్దుతిరుగుడు మొక్కలను నాటాడు. పువ్వులు పూచిన తరువాత ఆమెను తోటలోకి తీసుకువెళ్లి ఆశ్చర్యపరిచాడు.