AP: యుద్ధ భయం- తెలుగు రాష్ట్రాల అత్యవసర చర్యలు

తె­లు­గు ప్ర­జల పరి­స్థి­తి­పై తె­లు­గు ప్ర­భు­త్వా­ల ప్ర­త్యేక దృ­ష్టి

Update: 2026-03-03 05:15 GMT

ఇరా­న్–ఇజ్రా­యె­ల్ మధ్య పె­రు­గు­తు­న్న ఉద్రి­క్త­త­లు అం­త­ర్జా­తీయ స్థా­యి­లో ఆం­దో­ళన కలి­గి­స్తు­న్న నే­ప­థ్యం­లో, ఆ ప్రాం­తా­ల్లో ని­వ­సి­స్తు­న్న భా­ర­తీ­యుల భద్రత కీలక అం­శం­గా మా­రిం­ది. ము­ఖ్యం­గా అక్కడ పని­చే­స్తు­న్న లేదా చదు­వు­కుం­టు­న్న తె­లు­గు ప్ర­జల పరి­స్థి­తి­పై తె­లు­గు రా­ష్ట్ర ప్ర­భు­త్వా­లు ప్ర­త్యేక దృ­ష్టి సా­రిం­చా­యి. ఈ పరి­స్థి­తు­ల్లో ఆం­ధ్ర­ప్ర­దే­శ్ ప్ర­భు­త్వం అత్య­వ­సర చర్య­లు చే­ప­ట్టిం­ది. ఇరా­న్–ఇజ్రా­యె­ల్ మధ్య నె­ల­కొ­న్న ఉద్రి­క్త పరి­స్థి­తుల నే­ప­థ్యం­లో వి­విధ దే­శా­ల్లో చి­క్కు­కు­పో­యిన తె­లు­గు ప్ర­జ­ల­కు సహా­యం అం­దిం­చేం­దు­కు ఏపీ ప్ర­భు­త్వం సి­ద్ధ­మైం­ది. ఈ బా­ధ్య­త­ల­ను ఎన్‌­ఆ­ర్‌­టీ ఆర్టీ­జీ­ఎ­స్ వి­భా­గా­ల­కు అప్ప­గి­స్తూ ము­ఖ్య­మం­త్రి చం­ద్ర­బా­బు కీలక ఆదే­శా­లు జారీ చే­శా­రు. వి­దే­శా­ల్లో ఉన్న తె­లు­గు ప్ర­జల భద్ర­త­ను ని­ర్ధా­రిం­చేం­దు­కు కేం­ద్ర ప్ర­భు­త్వం­తో సమ­న్వ­యం చే­సు­కు­ని తక్షణ చర్య­లు చే­ప­ట్టా­ల­ని ఉన్న­తా­ధి­కా­రు­ల­కు సూ­చిం­చా­రు. వా­రి­ని సు­ర­క్షి­తం­గా స్వ­దే­శా­ని­కి తీ­సు­కు­రా­వ­డా­ని­కి ఏర్పా­ట్లు చే­యా­ల­ని స్ప­ష్టం చే­శా­రు.

ఇదే సమ­యం­లో ఇరా­న్, ఇజ్రా­యె­ల్ ప్రాం­తా­ల్లో వే­లా­ది మంది భా­ర­తీ­యు­లు చి­క్కు­కు­పో­యి­న­ట్లు సమా­చా­రం. వా­రి­ని సు­ర­క్షి­తం­గా బయ­ట­కు తీ­సు­కు­రా­వ­డం­లో భారత వి­దే­శాంగ శాఖ తన ప్ర­య­త్నా­ల­ను ము­మ్మ­రం చే­సిం­ది. అక్క­డి పరి­స్థి­తు­ల­ను సమీ­క్షి­స్తూ, రక్షణ చర్య­ల­ను వే­గ­వం­తం చే­స్తోం­ది. వి­మాన సదు­పా­యా­లు, భద్ర­తా మా­ర్గా­లు, స్థా­నిక అధి­కా­రు­ల­తో చర్చ­లు వంటి అం­శా­ల­పై దృ­ష్టి పె­ట్టిం­ది. అలా­గే తె­లు­గు రా­ష్ట్రాల ప్ర­భు­త్వా­లు కూడా తమ పౌ­రుల కోసం ప్ర­త్యేక హె­ల్ప్‌­లై­న్ నం­బ­ర్లు, వా­ట్సా­ప్ మరి­యు ఈమె­యి­ల్ సదు­పా­యా­ల­ను అం­దు­బా­టు­లో­కి తీ­సు­కు­వ­చ్చా­యి. అత్య­వ­సర పరి­స్థి­తు­ల్లో సం­ప్ర­దిం­చేం­దు­కు వీ­లు­గా ఈ వి­వ­రా­ల­ను అధి­కా­రి­కం­గా వి­డు­దల చే­శా­యి. ఇరా­న్–ఇజ్రా­యె­ల్ ఉద్రి­క్త­తల నే­ప­థ్యం­లో అక్కడ ఉన్న తె­లు­గు ప్ర­జ­లు అప్ర­మ­త్తం­గా ఉం­డా­ల­ని, ప్ర­భు­త్వ సూ­చ­న­ల­ను పా­టిం­చా­ల­ని అధి­కా­రు­లు కో­రు­తు­న్నా­రు. మొ­త్తం మీద, వి­దే­శా­ల్లో ఉన్న భా­ర­తీ­యుల భద్ర­తే ప్ర­థమ ప్రా­ధా­న్య­మ­ని కేం­ద్ర, రా­ష్ట్ర ప్ర­భు­త్వా­లు స్ప­ష్టం చే­స్తు­న్నా­యి.

విదేశాల్లో చిక్కుకున్న ప్రజలకు అండగా సర్కార్

పశ్చిమ ఆసి­యాలో నె­ల­కొ­న్న పరి­స్థి­తుల నే­ప­థ్యం­లో తె­లం­గాణ పౌ­రుల కోసం న్యూ ఢి­ల్లీ­లో­ని తె­లం­గాణ భవ­న్‌­లో తె­లం­గాణ ప్ర­భు­త్వం 24×7 కం­ట్రో­ల్ రూమ్ ఏర్పా­టు చే­సిం­ది. ము­ఖ్య­మం­త్రి ఏ. రే­వం­త్ రె­డ్డి ఆదే­శాల మే­ర­కు మధ్య­ప్రా­చ్య (పశ్చిమ ఆసి­యా) ప్రాం­తం­లో­ని కొ­న్ని దే­శా­ల్లో ఏర్ప­డు­తు­న్న పరి­స్థి­తు­ల­ను తె­లం­గాణ ప్ర­భు­త్వం సమ­గ్రం­గా పర్య­వే­క్షి­స్తోం­ది. న్యూ ఢి­ల్లీ­లో­ని తె­లం­గాణ భవన్ సీ­ని­య­ర్ అధి­కా­రు­లు భారత వి­దే­శాంగ మం­త్రి­త్వ శా­ఖ­తో పాటు సం­బం­ధిత భారత రా­య­బార కా­ర్యా­ల­యా­ల­తో ఇప్ప­టి­కే ని­రం­త­రం సం­ప్ర­దిం­పు­లు జరు­పు­తూ పరి­స్థి­తు­ల­ను అం­చ­నా వే­స్తు­న్నా­రు. ఆయా దే­శా­ల్లో ని­వ­సి­స్తు­న్న,చి­క్కు­కు­న్న తె­లం­గాణ పౌ­రు­లు, వారి కు­టుంబ సభ్యుల నుం­చి వస్తు­న్న వి­చా­ర­ణ­ల­ను దృ­ష్టి­లో ఉం­చు­కు­ని, తె­లం­గాణ ప్ర­భు­త్వం న్యూ ఢి­ల్లీ­లో­ని తె­లం­గాణ భవ­న్‌­లో 24 గంటల పాటు పని­చే­సే కం­ట్రో­ల్ రూ­మ్‌­ను ఏర్పా­టు చే­సిం­ది. అవ­స­ర­మైన సమ­న్వ­యం, సహా­యం అం­దిం­చేం­దు­కు ఈ కం­ట్రో­ల్ రూమ్ పని­చే­స్తుం­ది. ఆ ప్రాం­తా­ల్లో ఉన్న తె­లం­గాణ పౌ­రు­లు వారి కు­టుంబ సభ్యు­లు ఇబ్బం­దు­లు, ప్ర­యాణ­లు లేదా అత్య­వ­సర పరి­స్థి­తు­లు ఎదు­రై­తే ఈ కం­ట్రో­ల్ రూ­మ్‌­ను సం­ప్ర­దిం­చ­వ­చ్చు.

 వందన బరువా (పీఎస్ టు రెసిడెంట్ కమిషనర్ & లైజన్ హెడ్)\

+91 9871999044

సీహెచ్. చక్రవర్తి (పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్)

+91 9958322143

Tags:    

Similar News