Imran Khan: ఆక్స్‌ఫర్డ్ ఛాన్సలర్ రేసు నుంచి ఇమ్రాన్‌ఖాన్ ఔట్

నేరారోపణలు కారణంగా పోటీ నుంచి తప్పించిన వర్సిటీ;

Update: 2024-10-18 00:30 GMT

ఆక్స్‌ఫర్డ్ ఛాన్సలర్ రేసు నుంచి ఇమ్రాన్‌ఖాన్ తప్పుకున్నారు. యూనివర్సిటీ ఛాన్సలర్ పదవికి పోటీ చేస్తున్న జాబితాలో ఇమ్రాన్‌ఖాన్ పేరు లేదని ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం ప్రకటించింది. ఇమ్రాన్‌ఖాన్‌పై నేరారోపణలు ఉండడంతో ఆయనను పోటీ నుంచి యూనివర్సిటీ తప్పించింది. ఇమ్రాన్ ఖాన్ 1975లో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ నుంచి పట్టభద్రుడయ్యాడు. ఫిలాసఫీ, పాలిటిక్స్, ఎకనామిక్స్ చదివారు. ఈ పదవి కోసం 40 మంది అప్లై చేసుకోగా.. ప్రస్తుతం 38 మంది మాత్రం రేసులో ఉన్నారు. ఈ ఎన్నికల్లో 26, 000 మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నారు.

ఛాన్సలర్ పదవికి దరఖాస్తు చేసుకున్న వ్యక్తుల జాబితాలో ప్రముఖ పేర్లు యూకే మాజీ కన్జర్వేటివ్ పార్టీ నాయకుడు లార్డ్ విలియం హేగ్, యూకే మాజీ లేబర్ రాజకీయ నాయకుడు లార్డ్ పీటర్ మాండెల్సన్ రేసులో ఉన్నారు. ఈ సంవత్సరం ఆన్‌లైన్‌లో పోలింగ్ జరగనుంది. పూర్వ విద్యార్థులను అందుబాటులోకి తెచ్చేందుకు ఆన్‌లైన్ ఓటింగ్ చేపట్టినట్లు విశ్వవిద్యాలయం తెలిపింది.

Tags:    

Similar News