Kash Patel: ఎఫ్‌బీఐ చీఫ్‌గా భారత మూలాలున్న కాష్ పటేల్
డొనాల్డ్ ట్రంప్ మరో కీలక ఎంపిక..;
అగ్రరాజ్యం అమెరికాలో మరో భారత సంతతి వ్యక్తికి కీలక పదవి లభించింది. శక్తిమంతమైన దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్విస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) డైరెక్టర్‌గా తన సన్నిహితుడు కాష్ పటేల్‌ను అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నామినేట్ చేశారు. ‘తదుపరి ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా కాష్ పటేల్ బాధ్యతలు చేపడతారని గర్వంగా ప్రకటిస్తున్నా. కాష్ ఎంతో తెలివైన న్యాయవాది, పరిశోధకుడు. అవినీతిపై పోరాటం, దేశ ప్రజల రక్షణ కోసం తన కెరీర్‌లో ఎక్కువ కాలం వెచ్చించిన పోరాటయోధుడు’ అని ట్రంప్ ఎక్స్‌లో ప్రశ ంసించారు.
44 ఏళ్ల కాష్ పటేల్ జాతీయ భద్రతా మండలిలో ట్రంప్‌కి ఉగ్రవాద నిరోధక సలహాదారుగా, తన చివరి పదవీ కాలంలో తాత్కాలిక రక్షణ కార్యదర్శికి చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా పనిచేశారు. డిఫెన్స్ అటార్నీగా, ఫెడరల్ ప్రాసిక్యూటర్‌గా, నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా విధులు నిర్వహించారు. కాష్ పటేల్ పూర్వీకులు తూర్పు ఆఫ్రికా నుంచి కెనడాకు అక్కడ నుంచి యూఎస్ఏకి వలస వచ్చారు. గుజరాతీ భారతీయ దంపతులకు 1980లో న్యూయార్క్ గార్డెన్ సిటీలో కాష్ పటేల్ జన్మించారు. పటేల్ తండ్రి ఏవియేషన్ కంపెనీలో ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా పనిచేశారు.
పేస్ యూనివర్సిటీ లా స్కూల్ నుంచి గ్రాడ్యుయేషణ్ పూర్తి చేసిన తర్వాత, పటేల్ ప్రతిష్టాత్మక లా సంస్థలో జాబ్ సంపాదించాలనుకుని విఫలమయ్యాడు. బదులుగా అతను పబ్లిక్ డిఫెండర్‌గా మారారు. న్యాయశాఖలో చేరడానికి ముందు మయామిలోని లోకల్ అండ్ ఫెడరరల్ కోర్టుల్లో 9 ఏళ్లు పనిచేశారు. ఆ తర్వాత ట్రంప్ సన్నిహితుడైన రెప్.డెవిడ్ నూన్స్ నేతృత్వంలోని ఇంటెలిజెన్స్ కమిటీలో సిబ్బందిగా నియమించబడ్డాడు.
కాష్ పటేల్ ‘‘న్యూన్స్ మోమో’’ అని పిలిచే రచయితకు సాయం చేశాడు. ఇది ట్రంప్ ప్రచార వాలంటీర్లపై నిఘా పెట్టడానికి వారెంట్ పొందడంలో యూఎస్ జస్టిస్ డిపార్ట్‌మెంట్ తప్పు చేసిందని వివరించినట్లు ఫస్ట్ పోస్ట్ నివేదించింది. మోమో విడుదలపై న్యాయ శాఖ నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఈ పరిణామాలు కాష్ పటేల్ ట్రంప్ దృష్టిలో పడేలా చేశాయి. తర్వాత పటేల్ జాతీయ భద్రతా మండలిలో పనిచేయడానికి నియమించబడ్డాడు. ప్రస్తుతం ట్రంప్ గెలిస్తే, కాష్ పటేల్ కీలకమైన పొజీషన్‌లో ఉంటాడని తెలుస్తోంది.
ప్రస్తుతం ట్రంప్ కేబినెట్‌లో భారతీయ మద్దతుదారులుగా చెప్పబడుతున్న అమెరికన్లు అధికంగా ఉన్నారు. ట్రంప్ జాతీయ భద్రత సలహాదారుగా మైకెల్ వాల్ట్జ్, విదేశాంగ మంత్రిగా మార్కో రూబియో, ఆ దేశ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా తులసీ గబ్బార్డ్‌ని నియమించారు. వీరంతా కూడా భారత మద్దతుదారులుగా ఉన్నారు. తాజాగా కాష్ పటేల్ కూడా ప్రో-ఇండియా వ్యక్తిగా చెప్పబడుతున్నాడు.