అమెరికాలోని కాన్సాస్‌లో భారత సంతతికి చెందిన చర్చి పాస్టర్ పై కాల్పులు...

అమెరికాలోని కాన్సాస్ రాష్ట్రంలో గురువారం నాడు భారత సంతతికి చెందిన కాథలిక్ చర్చి పాస్టర్ ని ఒక వ్యక్తి కాల్చి చంపాడు.;

Update: 2025-04-04 08:39 GMT

అమెరికాలోని కాన్సాస్ రాష్ట్రంలో గురువారం నాడు భారత సంతతికి చెందిన చర్చి పాస్టర్ ని ఒక వ్యక్తి కాల్చి చంపాడు. 

ఈ వార్తను పంచుకుంటూ, కాన్సాస్ నగర ఆర్చ్‌డయోసెస్‌కు చెందిన ఆర్చ్‌బిషప్ జోసెఫ్ నౌమాన్ ఫేస్‌బుక్ పోస్ట్‌లో..  “ఈరోజు తెల్లవారుజామున ఘోరంగా కాల్చి చంపబడిన ఫాదర్ అరుల్ కరసాల మరణ విషాద వార్తను పంచుకోవడానికి చింతిస్తున్నాను. ఈ అర్థరహిత హింసాత్మక చర్య నా ప్రియమైన స్నేహితుడిని దూరం చేసింది. మాకు దుఃఖాన్ని మిగిల్చింది అని పేర్కొన్నారు. 

అరుల్ కరసాల 1994లో భారతదేశంలో పాస్టర్ గా సేవలందించేవారు. ఒక ఆర్చ్ బిషప్ అతన్ని ఆర్చ్‌డయోసెస్‌ కు ఆహ్వానించారు. 2004 నుండి కాన్సాస్‌లో పాస్టర్ గా అరుల్ పనిచేస్తున్నారు. 2011లో అరుల్ అమెరికన్ పౌరసత్వాన్ని పొందారు.

ఒక వృద్ధుడు అరుల్ వద్దకు నడుచుకుంటూ వచ్చి అతనిపై మూడుసార్లు కాల్పులు జరిపాడని పారిష్ మత విద్య డైరెక్టర్ క్రిస్ ఆండర్సన్ తెలిపారు, అయితే హత్య వెనుక గల కారణం తనకు తెలియదని అన్నారు.

అనుమానితుడు అరెస్టు

గ్యారీ ఎల్. హెర్మెష్ (66) అనే అనుమానితుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు ఒక్లహోమాలోని తుల్సాకు చెందినవాడు. అరుల్ కరసాల ఆంధ్రప్రదేశ్‌లోని కడపకు చెందినవారు. 


Tags:    

Similar News