Dubai: దుబాయ్‌లో 18 ఏళ్ల భారతీయ విద్యార్థి గుండెపోటుతో మృతి
దీపావళి వేడుకల్లో పాల్గొన్న కొద్దిసేపటికే ఘటన
దుబాయ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. గోల్డెన్ వీసా కలిగి ఉన్న 18 ఏళ్ల భారతీయ విద్యార్థి వైష్ణవ్ కుమార్ గుండెపోటుతో మృతిచెందాడు. దీపావళి రోజునే ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.
వైష్ణవ్ కృష్ణకుమార్.. దుబాయ్‌లోని మిడిల్‌సెక్స్ యూనివర్సిటీలో బీబీఏ మార్కెటింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. గోల్డెన్ వీసా కలిగి ఉన్నాడు. మంగళవారం దీపావళి వేడుకలు జరుపుకుంటున్నారు. ఆ సమయంలో ఒక్కసారిగా వైష్ణవ్ కృష్ణకుమార్ కుప్పకూలిపోయాడు. దీంతో హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే పరిస్థితులు చేజారిపోయాయి. గుండెపోటు కారణంగా మరణించాడని వైద్యులు ప్రకటించారు. అయితే గుండెపోటు వార్తలను కుటుంబ సభ్యులు తోసిపుచ్చారు. తమ కుమారుడికి గుండెపోటు సమస్యలు లేవని వాపోయారు. దీంతో దుబాయ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మృతదేహాన్ని అంతిమ సంస్కారాల కోసం కేరళకు తీసుకెళ్లాలని తల్లిదండ్రులు దుబాయ్ అధికారులను కోరారు. అన్ని ఏర్పాట్లు పూర్తి కాగానే మృతదేహం శుక్రవారం కేరళకు చేరే అవకాశం ఉందని వైష్ణవ్ కుమార్ మామ, దుబాయ్ నివాసి నితీష్ ఖలీజ్ తెలిపాడు. వైష్ణవ్ కుమార్‌కు అసలేం జరిగిందో అర్థం కావడం లేదన్నారు. దీనిపై స్పష్టమైన వివరాలు తెలియాలని కోరారు.
వైష్ణవ్ తండ్రి కృష్ణకుమార్ 20 సంవత్సరాలకు పైగా దుబాయ్‌లో పనిచేస్తున్నారు. వైష్ణవ్, అతని చెల్లెలు దుబాయ్‌లోనే పుట్టి పెరిగారు. దుబాయ్‌లో స్నేహితులు చాలా మంది ఉన్నారని.. తెలివైన అబ్బాయి అని బంధువు తెలిపారు. రెండేళ్ల క్రితం కొత్తగా నిర్మించిన ఇంటి గృహప్రవేశం కోసం కేరళ వచ్చారని చెప్పారు. వైష్ణవ్ అంత్యక్రియలు కేరళలోని ఇంటి ఆవరణలో నిర్వహిస్తామని పేర్కొన్నారు.