బ్రిటన్‌లో భారత డాక్టర్ అరెస్ట్
లండన్‌లో భారతీయ మానసిక వైద్యుడికి ఆరేళ్ల కారాగార శిక్ష... పిల్లలపై లైంగిక వేధింపుల చిత్రాలను షేర్ చేసినందుకు శిక్ష;
లండన్‌లో భారతీయ మానసిక వైద్యుడికి ఆరేళ్ల కారాగార శిక్ష పడింది. పిల్లలపై లైంగిక వేధింపులకు సంబంధించిన చిత్రాలను డార్క్‌వెబ్‌లో షేర్ చేయడంతో శిక్ష పడింది. “ది అనెక్స్”అనే వెబ్‌సైట్‌కు మోడరేటర్‌గా ఉన్న కబీర్ గార్గ్ దానిని ఆపరేట్ చేస్తున్నాడు. ఇందులో పిల్లల వేధింపులకు సంబంధించిన కంటెంట్ షేర్ అవుతోంది. ఈ సైట్‌లో ప్రపంచం నలుమూలల నుంచి దాదాపు 90,000 మంది సభ్యులు ఉన్నారు.వారు రోజూ పిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలు, వేధింపులకు సంబంధించిన వందలాది లింక్‌లను షేర్ చేస్తున్నారు. పిల్లలపై నేరాలను పంచుకునే, చర్చించే ఇతర నేరస్థులతో కనెక్ట్ అవ్వడానికి అతను డార్క్ వెబ్‌ను ఉపయోగించినట్లు యూకే నేషనల్ క్రైమ్ ఏజెన్సీ గుర్తించింది. కబీర్ గార్గ్ కోర్టులో నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. అతడి ల్యాప్‌టాప్, మెమోరీ కార్డులో వేలాదిగా అభ్యంతకర చిత్రాలను కనగొన్నట్లు బ్రిటన్‌కు చెందిన జాతీయ నేర దర్యాప్తు సంస్థ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 90 వేల మంది సభ్యులు గల ది అనెక్స్ అనే వెబ్‌సైట్‌లో కబీర్ మోడరేటర్‌గా ఉన్నాడని వెల్లడించింది. ఈ వెబ్‌సైట్‌లో ప్రతిరోజు పిల్లలపై లైంగిక వేధింపులకు సంబంధించిన వందలాది లింక్స్ షేర్ చేస్తుంటారని పేర్కొంది. తాను రన్ చేస్తున్న సైట్‌లో పిల్లలపై లైంగిక దాడికి సహకరించడం, పిల్లల అసభ్యకరమైన చిత్రాలను షేర్ చేయడం నిషేధిత చిత్రాలను కలిగి ఉండటం వంటి అనేక ఆరోపణలను డాక్టర్ గార్గ్ కోర్టులో అంగీకరించినట్లు NCA వెల్లడించింది. 2022 నవంబర్‌లో డాక్టర్ గార్గ్‌ని లండన్‌లోని అతని నివాసంలోనే పోలీసులు అరెస్టు చేశారు.ల్యాప్‌టాప్, ఇతర పరికరాలను విచారణ కోసం స్వాధీనం చేసుకున్నారు. క్రైమ్ ఏజెన్సీ అతని పరికరాలలో చాట్ లాగ్‌ల వంటి సాక్ష్యాలను కనుగొంది, అది పిల్లల పట్ల అతని ఆసక్తిని, మోడరేటర్‌గా అతని పాత్రను బహిర్గతం చేసింది. ది అనెక్స్ ఇప్పుడు యాక్టివ్‌గా లేదు, ఈ వెబ్‌సైట్‌లో ప్రతిరోజు పిల్లలపై లైంగిక వేధింపులకు సంబంధించిన వందలాది లింక్స్ షేర్ చేస్తుంటారని పేర్కొంది.