United States: అమెరికాలో బంధువులను హత్య చేసిన ఎన్నారై విద్యార్థి
ఆన్‌లైన్‌లో నిందితుడు తుపాకీ కొనుగోలు చేశాడన్న పోలీసులు;
అమెరికాలో ఓ భారతీయ విద్యార్థి తన బంధువులను తుపాకీతో కాల్చి చంపాడు. న్యూజెర్సీలో ఉంటున్న ఓం బ్రహ్మ భట్ తన తాత, మామలను హత్య చేశాడు. దిలీప్ కుమార్ బ్రహ్మభట్, బిందు బ్రహ్మభట్, యశ్‌కుమార్ బ్రహ్మభట్‌లను నిందితుడు పొట్టనపెట్టుకున్నట్టు స్థానిక పోలీసులు తెలిపారు. ముగ్గురిని హత్య చేయడం, ఆయుధాన్ని కలిగి ఉండటం తదితర నేరాలపై కేసు నమోదు చేశారు. నిందితుడు గుజరాత్ నుంచి వచ్చినట్టు పేర్కొన్నారు. అతడు ఆన్‌లైన్‌లో తుపాకీ కొనుగోలు చేశాడని, తాము ఘటనా స్థలానికి చేరుకునే సరికి ఓం బ్రహ్మభట్ అక్కడే ఉన్నాడని పోలీసులు తెలిపారు.
యూఎస్‌లో ఓ విద్యార్ధి తన కుటుంబ సభ్యులను కాల్చి చంపాడనే అభియోగంపై పోలీసులు అరెస్టు చేయడం సంచలనం రేపింది. ఓ భవనం రెండవ అంతస్తులో ఓ వృద్ధ జంటతో పాటు వారి కుమారుడు చనిపోయి ఉండటం పోలీసులు గుర్తించారు.
యూఎస్ లో 23 సంవత్సరాల ఓం బ్రహ్మ్‌భట్ అనే భారతీయ విద్యార్ధి తన కుటుంబ సభ్యులైన దిలీప్ కుమార్ కుమార్ బ్రహ్మభట్, బిందు బ్రహ్మభట్ , యష్ కుమార్ బ్రహ్మభట్ లను కాల్చి చంపినట్లు ఆరోపణలు వచ్చాయి. సౌత్ ప్లెయిన్ ఫీల్డ్ ట్రెడిషన్స్ కాండో కాంప్లెక్స్‌లో కాల్పులు జరిగినట్లు ఇరుగుపొరుగువారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలంలో ఇద్దరు పురుషులు, ఒక మహిళ చనిపోయినట్లు పోలీసులు గుర్తించారు. అనుమానాస్పదంగా కనిపించిన ఓం బ్రహ్మ్‌భట్‌ను అదుపులోకి తీసుకున్నారు.
ఓం బ్రహ్మ్‌భట్ ఆయుధాలను కలిగి ఉన్నట్లు పోలీసులు చెప్పారు. గుజరాత్‌కు చెందిన ఈ యువకుడు మృతుల కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. పోలీసులు చెబుతున్న ప్రకారం వారు సంఘటనా స్థలానికి చేరుకున్నప్పుడు అతను అక్కడ కనిపించాడు. ఆన్‌లైన్లో కొన్న ఓ తుపాకీతో నేరానికి పాల్పడినట్లు పోలీసులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతం సౌత్ ప్లెయిన్‌ఫీల్డ్ పోలీస్ డిపార్ట్‌మెంట్ కేసును విచారిస్తోంది.