H-1B Visa Row: భారతీయ నిపుణులకు స్వాగతం పలుకుతున్న జర్మనీ...
H-1B వీసా వివాదం నేపథ్యంలో జర్మన్ రాయబారి..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ H-1B వీసా రుసుమును $100,000 (రూ. 88 లక్షలు)కు పెంచడం ఒక్కసారిగా భారతీయ టెక్కీలో ఆందోళన నింపింది. తమ అమెరికన్ డ్రీమ్స్‌ను ట్రంప్ కాలరాస్తున్నాడనే ఆవేదన వ్యక్తమైంది. H-1B వీసా ఫీజు పెంపు విషయం గందరగోళంగా మారుతున్న తరుణంలో మేము ఉన్నామంటూ ఓ యూరోపియన్ దేశం ముందుకు వచ్చింది. భారత టెక్కీలు తమ దేశానికి రావాలని ఆహ్వానించింది.
భారతదేశంలోని అత్యంత నైపుణ్యం ఉన్న వారు జర్మనీకి రావాలని ఆ దేశ రాయబారి కోరారు. భారతదేశంలో జర్మన్ రాయబారి ఫిలిప్ అకెర్మాన్ మాట్లాడుతూ.. జర్మనీ దేశంలో ఐటీ, నిర్వహణ, సైన్ అంట్ టెక్ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు స్వీకరించడానికి అత్యంత నైపుణ్యం కలిగిన భారతీయులకు తమ దేశానికి రావాలని పిలుపునిచ్చారు. జర్మనీలో అత్యధికంగా సంపాదిస్తున్న వారిలో భారతీయులు కూడా ఉన్నారని అన్నారు.
‘‘జర్మనీలో పనిచేసే సగటు భారతీయులు జర్మన్ వ్యక్తి కన్నా ఎక్కువగా సంపాదిస్తాడు. ఎక్కవ జీతం ఎందుకంటే, భారతీయులు మన సమాజం కోసం మన సంక్షేమానికి పెద్ద మొత్తంలో దోహదపడుతున్నారు. మేము కష్టపడి పనిచేయడం, ఉత్తమ ఉద్యోగులకు ఉత్తమ ఉద్యోగాలు ఇవ్వడాన్ని నమ్ముతున్నాం’’ అని అన్నారు. జర్మన్ రాయబారి తమ దేశంలో ఉద్యోగాలను జర్మన్ కార్లతో పోల్చారు. ఇది ప్రపంచంలోనే అత్యంత విశ్వసనీయ కార్లుగా ఉన్నాయి.