US Warship Abraham Lincoln: అమెరికా వార్ షిప్ అబ్రహం లింకన్ పై దాడి చేశామన్న ఇరాన్.. అలాంటిది ఏమీ లేదన్న అమెరికా
నౌకకు ఏమైంది?
అమెరికా యుద్ధ నౌకల్లోనే కీలకమైన విమాన వాహక నౌక అబ్రహం లింకన్. ఈ నౌక నుంచి యుద్ధ విమానాలు రాకపోకలు సాగిస్తుంటాయి.. అలాంటి ఈ యుద్ధ నౌకపై దాడి చేసి.. ధ్వంసం చేశామంటూ ఇరాన్ ప్రకటించింది. ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషన్ గార్డ్ కార్ప్స్ (IRGC) ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణులు.. అమెరికా వార్ షిప్ అబ్రహం లింకన్ ను ఢీకొట్టాయని.. దీంతో అది పని చేయటం ఆగిపోయిందని.. గల్ఫ్ జలాల నుంచి వెనక్కి వెళ్లిపోయిందని ప్రకటించింది ఇరాన్.
ఇరాన్ ప్రకటనను ఖండించింది అమెరికా ఆర్మీ. మా వార్ షిప్ అబ్రహం లింకన్ కు ఎలాంటి డ్యామేజ్ కాలేదని.. సురక్షితంగా ఉందని.. ఇరాన్ ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణులను తిప్పికొట్టిందని కౌంటర్ సమాధానం ఇచ్చింది.
ఇరాన్ వాదన
ఒమన్ సముద్రంలో ఇరాన్ సముద్ర సరిహద్దుల నుంచి దాదాపు 340 కిలోమీటర్ల దూరంలో ఉన్న USS అబ్రహం లింకన్ విమాన వాహక నౌకను అధునాతన క్షిపణులు ,డ్రోన్లతో ఢీకొట్టామని ఇరాన్ పవిత్ర ప్రవక్త కేంద్ర ప్రధాన కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.దాడి తరువాత, అమెరికా నౌక ,దానితో పాటు వచ్చిన టీం కూడా ఆ ప్రాంతం నుంచి వెళ్లిపోయినట్లు కనిపించిందని ఇరాన్ రాష్ట్ర టీవీ తెలిపింది. ఈ వాదనపై ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ ఎటువంటి ప్రకటన చేయనప్పటికీ ఇరాన్ సైన్యం IRGC కూడా గతంలో లింకన్‌ను ఢీకొట్టినట్లు వాదిస్తోంది.
వాదనను కొట్టిపారేసిన అమెరికా..
ఇరాన్ ప్రకటనను అమెరికా తోసిపుచ్చింది. యుఎస్ సెంట్రల్ కమాండ్ (CENTCOM) అమెరికన్ యుద్ధనౌక ఫొటోను పోస్ట్ చేసింది. అబ్రహం లింకన్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీకి మద్దతు ఇస్తూ,సముద్రం నుంచి తన సత్తా చాటుతుందని రాసింది.