Israel-Hamas Conflict: మరోసారి రణరంగంగా మారిన పశ్చిమాసియా..70 మంది మృతి
గాజాలో వైమానిక దాడులకు పాల్పడిన ఇజ్రాయెల్..;
ఇజ్రాయెల్- హమాస్‌ల మధ్య ఉద్రిక్తతలతో పశ్చిమాసియా మళ్లీ రణరంగంగా మారుతుంది. తాజాగా ఉత్తర గాజాలోని ఇళ్లపై మంగళవారం రాత్రి వైమానిక దాడులకు పాల్పడింది ఇజ్రాయెల్. ఈ భీకర దాడిలో సుమారు 48 మంది పౌరులు చనిపోగా.. అందులో 22 మంది చిన్నారులు ఉన్నట్లు జబాలియాలోని ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. పలు నివాస భవనాలు పూర్తిగా ధ్వంసమైనట్లు ప్రకటించారు.
అయితే, అమెరికా మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్- హమాస్ మధ్య ఒప్పందం కుదిరింది. కానీ, హమాస్ ఒక ఇజ్రాయెల్-అమెరికన్ బందీని రిలీజ్ చేసిన తర్వాత ఈ దాడులు నెలకొన్నాయి. యూఎస్ అధినేత డొనాల్డ్ ట్రంప్ సౌదీ అరేబియా టూర్ లో ఉన్న సమయంలోనే గాజాపై ఇజ్రాయెల్ దాడులు చేయడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. మంగళవారం యుద్ధం గురించి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమన్ నెతన్యాహు మాట్లాడుతూ.. గాజాలో తమ యుద్ధాన్ని ఆపడానికి ఎలాంటి మార్గం లేదన్నారు. ఇక, హూతీ రెబల్స్ ఇటీవల ఇజ్రాయెల్‌పై దాడులకు పాల్పడడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కచ్చితంగా హూతీలను ఎదురుదెబ్బ తీస్తామని హెచ్చరించారు.