Hamas : హమాస్ కమాండర్ డెయిఫ్ ను లేపేసిన ఇజ్రాయెల్

Update: 2024-08-02 09:39 GMT

గత నెలలో ఖాన్ యూనిస్ ప్రాంతంపై జరిపిన దాడు ల్లో హమాస్ మిలిటరీ వింగ్ కమాండర్ మహమ్మద్ డెయిఫ్ హతమైనట్లు టెల్ అవీవ్ నిర్ధారించింది. ఏడాది ఇజ్రాయెల్ పై హమాస్ మెరుపు దాడుల వెనుక ప్రధాన సూత్రధారిగా మహమ్మద్ డెయిఫ్ పేరు ఉంది. అక్టోబరు 7, 2023న ఇజ్రాయెల్పై దాడికి సూత్రధారిగా భావిస్తున్న హమాస్ మిలిటరీ చీఫ్ మొహమ్మద్ డెయిఫ్ గత నెలలో గాజాలో వైమానిక దాడిలో మరణించినట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది.

ఇరాన్ రాజధాని టెహ్రాన్ హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హనియే హత్యకు గురైన ఒక రోజు తర్వాత ఇది వెలుగులోకి వచ్చింది. దక్షిణ గాజా నగరం అయిన ఖాన్ యూనిస్ పై జులై 13న ఇజ్రాయెల్ దాడి చేసింది. ఆ దాడిలో స్థానికంగా గూడారాల్లో ఉన్న పౌరులు సహా 90 మందికి పైగా మరణించినట్లు అప్పడు గాజా ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఆ దాడిలో డెయిఫ్ మరణించినట్లు వెంటనే ధ్రువీకరణ కాలేదు. తాజాగా దీనిపై ఇజ్రాయెల్ సైన్యం ప్రకటన విడుదల చేసింది.

పలు మార్లు చిక్కినట్లే చిక్కి చేజారిపోగా.. డెయిఫ్ లక్ష్యంగా గాజాలో చేసిన దాడిలో అతడు ప్రాణాలు కోల్పోయినట్లు తమ నిఘా విభాగం అంచనాకు వచ్చిందని వెల్లడించింది.

Tags:    

Similar News