USA : NIH డైరెక్టర్‌గా జై భట్టాచార్య నియామకం

Update: 2025-03-26 11:15 GMT

USA “నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్” డైరెక్టర్‌గా భారత మూలాలున్న జై భట్టాచార్య ఎన్నికయ్యారు. USA సెనెట్‌ 53-47 ఓట్ల తేడాతో ఆయన నియామకానికి ఆమోదం తెలిపింది. NIH అమెరికా వైద్య విధానాలను పర్యవేక్షించే అత్యున్నత సంస్థ . భట్టాచార్య ప్రస్తుతం స్టాన్‌ఫోర్డ్ వర్సిటీలో ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ట్రంప్ ప్రభుత్వం ఇప్పటికే భారత సంతతి నేతలను పలు కీలక పదవుల్లో నియమించిన సంగతి తెలిసిందే. జయ్‌ భట్టాచార్య 1968లో కోల్‌కతాలో జన్మించారు. ఆయన విద్యాభ్యాసం స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్శిటీలో ప్రారంభమైంది, అక్కడ ఆయన 1997లో మెడిసిన్‌లో డాక్టరేట్‌ పొందారు. ఆ తర్వాత, ఆర్థికశాస్త్రంలో పీహెచ్‌డీ కూడా స్టాన్‌ఫోర్డ్‌లోనే పూర్తి చేశారు. ఆయన స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్శిటీలో హెల్త్‌ పాలసీ ప్రొఫెసర్‌గా పనిచేశారు మరియు నేషనల్‌ బ్యూరో ఆఫ్‌ ఎకనామిక్స్‌ రీసెర్చ్‌లో రీసెర్చ్‌ అసోసియేట్‌గా కూడా పనిచేశారు.

Tags:    

Similar News