Jallikattu: శ్రీలంకలో తొలిసారిగా జల్లికట్టు పోటీలు

జల్లికట్టు సంబరాల్లో మొత్తం 200 ఎద్దులు

Update: 2024-01-08 05:00 GMT

 భారత్‌లో 2 వేల 500 ఏళ్లుగా నిర్వహిస్తున్న సంప్రదాయ జల్లికట్టు పోటీలు సరిహద్దులు దాటాయి. పొంగల్ వేడుకను పురస్కరించుకుని పొరుగు దేశం శ్రీలంకలో తొలిసారిగా జల్లికట్టు పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీల్లో 200 ఎద్దులు బరిలో ఉండనున్నట్టు తెలుస్తోంది. పొంగల్‌ సందర్భంగా జల్లికట్టుతో పాటు , పడవ పందేలు, ఎద్దుల బండిపోటీలు, సిలంబమ్ ఫైట్‌లు నిర్వహిస్తున్నారు.

వందలాది ఏళ్లుగా తమిళనాడులో ఏటా పొంగల్‌ను పురస్కరించుకుని జరుపుకొనే జల్లికట్టు పోటీలు మరో దేశానికి విస్తరించాయి. పొంగల్ వేడుక సందర్భంగా శ్రీలంకలో ఏటా నిర్వహించే పడవ పందేలు, ఎద్దుల బండిపోటీలు, సిలంబమ్ ఫైట్‌లతో పాటు ఈ సారి జల్లికట్టు పోటీలు ప్రారంభమయ్యాయి. త్రింకోమాలీలో తొలిసారిగా జరుగుతున్న ఈ పోటీలను తూర్పు ప్రావిన్స్ గవర్నర్‌ సెంథిల్ తోండమన్, మలేసియా ఎంపీ ఎమ్ శరవణన్ ప్రారంభించారు. నిర్వాహకులు కొన్ని ఎద్దులను పోటీల్లో నిలిపారు. రానున్న రోజుల్లో జల్లికట్టులో సుమారు 200 ఎద్దులు పాల్గొనన్నాయి. పెద్ద సంఖ్యలో వీక్షకులు వచ్చే అవకాశం ఉండటంతో 100 మంది పోలీసులతో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు....SPOT

పొంగల్ పండగను పురస్కరించుకుని శ్రీలంకలోని త్రింకోమాలీ కిన్నియా వంతెన వద్ద పడవ పందేలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను కూడా తూర్పు ప్రావిన్స్ గవర్నర్‌ సెంథిల్ తోండమన్‌ ప్రారంభించారు. పందేల్లో 55 పడవలు బరిలో నిలవగా100 మంది ఆటగాళ్లు పోటీపడ్డారు. పోటీల్లో విజేతలకు సెంథిల్ నగదు బహుమతి అందజేశారు.ఈ వేడుకల నిర్వహణ శ్రీలంక, తమిళనాడు మధ్య భాగస్వామ్య వారసత్వాన్ని ప్రదర్శిస్తుందని తోండమన్‌ పేర్కొన్నారు. తమిళ సమాజంతో సాంస్కృతిక కార్యక్రమాల పునరుద్ధరణ జరిగినందుకు గర్వపడుతున్నట్టు చెప్పారు. 

Tags:    

Similar News