ట్రంప్ లేఖ చాలా గొప్పగా ఉంది : జో బైడెన్
అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వైట్ హౌజ్‌ను వీడుతూ తన కోసం రాసిన లేఖపై అమెరికా నూతన అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు.;
అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వైట్ హౌజ్‌ను వీడుతూ తన కోసం రాసిన లేఖపై అమెరికా నూతన అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. ట్రంప్ చాలా ఉదారమైన, గొప్ప లేఖ రాశారు అని చెప్పారు. త్వరలోనే ట్రంప్‌తో మాట్లాడనున్నట్లు బైడెన్ వెల్లడించారు. ఎన్నికల్లో బైడెన్ గెలుపును అంగీకరించని ట్రంప్.. అధికార బదలాయింపుకు అడ్డు తగులుతూ వచ్చారు. అయితే చివరకు మాత్రం కొత్త అధ్యక్షులకు లేఖ రాసే సంప్రదాయాన్ని మాత్రం కొనసాగించారు. కొత్త అధ్యక్షుడికి పాత అధ్యక్షుడు ఇలా సందేశమివ్వడం అనేది ఆనవాయితీగా వస్తుంది. కాగా, బుధవారం అమెరికా 46వ అధ్యక్షుడిగా బైడెన్, ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ ప్రమాణస్వీకారం చేశారు. ప్రమాణస్వీకారం చేసిన తొలిరోజే 15 కీలక ఆదేశాలపై సంతకాలు చేశారు జో బైడెన్.