క్షణం మలుపులు తిరుగుతూ.. తీవ్ర ఉంత్కంఠ రేపిన అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మెగా విక్టరీ సాధించిన జో బైడెన్ను కమలా హారిస్ ఫోన్లో అభినందించారు. మనం సాధించాం.. మీరు తదుపరి అధ్యక్షుడు అవుతున్నారు అంటూ ఆనందం వ్యక్తంచేశారు.
ఫోన్లో ఇలా అభినందించిన ఆమె.. తరువాత ట్విట్టర్ వేదికంగా బైడెన్ను కొనియాడారు. జో బైడెన్ విజయం ఆమెరికన్ల ఆత్మకు సంబంధించినదని పేర్కొన్నారు. అమెరికాకు చేయాల్సింది ఎంతో ఉందన్నారు. ఏ ప్రెసిడెంట్ ఆఫ్ ఆల్ అమెరికన్స్ అంటూ ఓ వీడియో సందేశం పోస్ట్ చేశారు.
అమెరికాకు తాను తొలి మహిళా ఉపాధ్యక్షురాలు కావొచ్చు.. కానీ ఆఖరు ఆమె కాకూడదు అంటూ సందేశాత్మక ట్వీట్ చేశారు.. భారత సంతతికి చెందిన కమలా హారిస్ అమెరికాకు మొదటి మహిళా ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టనున్నారు.