అమెరికా అధ్యక్ష పోటీకి సిద్ధమవుతున్న ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ( Kamala Harris ) ప్రచారంలో దూసుకుపోతున్నారు. తాజాగా 3.60 లక్షల మంది వాలంటీర్లు ఆమెకు మద్దతు పలికారు. షికాగోలో వచ్చే నెల జరగనున్న పార్టీ జాతీయ సమావేశంలో ఆమె అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ క్రమంలో పార్టీలో ఆమెకు మద్దతు కూడా పెరుగుతోంది.
ప్రచారం ప్రారంభించిన వారం వ్యవధిలోనే దాదాపు 20 కోట్ల డాలర్లను ఆమె బృందం సేకరించింది. కమలా హారిస్ ప్రచారంలో ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. రోజురోజుకు విశేష ఆదరణ లభిస్తోంది. ఒక వారంలోనే 200 మిలియన్ల డాలర్ల విరాళాలు సేకరించాం. ఇందులో మూడింట రెండు వంతుల విరాళాలు కొత్త మద్దతుదారుల నుంచే అందాయి.
ప్రచార పర్వంలో తాజాగా 3.60 లక్షల మంది భాగమయ్యారని హారిస్ ఫర్ ప్రెసిడెంట్ బాటిల్ గ్రౌండ్ స్టేట్స్ డైరెక్టర్ డాన్ కన్నీనెస్ వెల్లడించారు. మరో పక్క అమెరికాలో అధ్యక్ష ఎన్నికలకు 100 రోజులు మాత్రమే ఉన్నందున ప్రత్యర్థి డొనాల్ ట్రంప్ ను ఎదుర్కొనేందుకు కమలా హారిస్ ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశారు.