Kenya Plane Crash: కెన్యాలో కూలిన విమానం.. 12 మంది మృతి

ప్రతికూల వాతావరణమే కారణం

Update: 2025-10-28 08:15 GMT

కెన్యాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. మంగళవారం తెల్లవారుజామున క్యాలే కౌంటీలోని డయాని నుంచి కిచ్వా టెంబోకు వెళ్తున్న తేలికపాటి విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది. పర్యాటకులతో వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. టూరిస్టుల సహా 12 మంది మృతి చెందారు.

విమాన ప్రమాదాన్ని కెన్యా సివిల్ ఏవియేషన్ అథారిటీ (KCAA) ధృవీకరించింది. విమానం రిజిస్ట్రేషన్ నంబర్ 5Y-CCAగా గుర్తించారు. మంగళవారం ఉదయం 5:30 గంటలకు ఈ ప్రమాదం జరిగిందని వెల్లడించింది. ప్రమాదానికి గల కారణాలను అన్వేషిస్తున్నట్లు తెలిపింది. ప్రభుత్వ సంస్థలు సంఘటనాస్థలికి వెళ్లినట్లు పేర్కొంది.

అయితే విమాన ప్రమాదానికి ప్రతికూల వాతావరణమే కారణమని తెలుస్తోంది. వాతావరణం అనుకూలించకపోయినా.. విమానం ముందుకు సాగినట్లుగా స్థానిక మీడియా పేర్కొంది. ఈ ప్రమాదానికి పొగమంచు కారమణమని.. మేఘాలు కప్పబడి ఉండడంతో పైలట్ నియంత్రణ కోల్పోయి ఉండొచ్చని మీడియా పేర్కొంది.

Tags:    

Similar News