Israeli Police: ఇజ్రాయేల్‌కు షాకిచ్చిన కేరళ సంస్థ

పోలీస్ యూనిఫాం కొత్త ఆర్డర్లను స్వీకరించబోమన్న మరియన్ అపెల్ యాజమాన్యం;

Update: 2023-10-22 06:00 GMT

గాజాలోని హమాస్ మిలిటెంట్ల స్థావరాలే లక్ష్యంగా గత కొంతకాలంగా  ఇజ్రాయేల్‌ జరుపుతున్న భీకరదాడులతో అక్కడ దుర్బర పరిస్థితులు నెలకున్నాయి. గాజాలో ప్రజల స్థితిపై  ప్రపంచ దేశాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయేల్‌ పోలీసులకు యూనిఫాం సరఫరా చేసే కేరళకు దుస్తుల తయారీ సంస్థ మరియన్‌ అపరెల్‌ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. గాజాలో పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే వరకూ ఇజ్రాయేల్ నుంచి తాము కొత్త ఆర్డర్లను స్వీకరించబోమని ప్రకటించింది. యుద్ధం మొదలైన తొలి రోజుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని.. కానీ ప్రస్తుతం గాజాలో జరుగుతున్న విధ్వంసం చూశాక ఈ నిర్ణయానికి వచ్చామని యాజమాన్యం ప్రకటించింది.

 2015 నుంచి ఇజ్రాయేల్‌ పోలీసులకు దుస్తులు  తయారుచేసి సరఫరా చేస్తున్నారు. అయితే ఆ దేశంపై హమాస్‌ దాడి ఇదే సమయంలో ప్రతీకారం పేరుతో ఇజ్రాయెల్‌ చేస్తున్న దాడి కూడా అమానవీయం. అయితే అంతర్జాతీయ ఒప్పందాలను అనుసరించి ఇప్పటికే ఉన్న ఆర్డర్లను పూర్తి చేసినట్టుగా యాజమాన్యం చెబుతోంది. ఈ నేపధ్యంలో  కొత్త ఆర్డర్లను తీసుకోబోము అంటూ ఓ వీడియోను విడుదల చేశారు. ఇజ్రాయేల్ పోలీసులకు లేత నీలి రంగు, పొడవు చేతుల షర్టులను మరియన్ అపరెల్ను వీరు  తయారు చేస్తారు. 


మరియన్ అపరెల్‌ను కన్నూరులోని కిన్‌ఫ్రా పార్కులో 2006లో ఏర్పాటు చేశారు. ఈ దుస్తుల తయారీ సంస్థ ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన ఆర్మీ, పోలీసులు, సెక్యూరిటీ అధికారులు, ఆరోగ్య సిబ్బందికి దుస్తులను సరఫరా చేస్తుంది. వీటితో పాటు స్కూల్ యూనిఫామ్‌లు, సూపర్ మార్కెట్‌ సిబ్బంది, వైద్యులకు తెల్లకోట్లు, కార్పోరేట్ దుస్తులను కూడా సమకూర్చుతుంది. ఈ ప్రాంతంలో సంప్రదాయ బీడీ పరిశ్రమ క్రమంగా అంతరించిపోవడంతో స్థానికులు ఉద్యోగ, ఉపాధి కల్పనే లక్ష్యంగా ఈ మరియన్ అపరెల్ ఏర్పాటు చేసారు.

Tags:    

Similar News