Largest Hindu Temple: న్యూజెర్సీలో అక్షర్‌ధామ్ ఆలయం
భారత్ వెలుపల నిర్మించిన అతిపెద్ద కోవెల ఇదే;
భారత్ వెలుపల ఉన్న అతిపెద్ద హిందూ దేవాలయం అమెరికాలోని న్యూజెర్సీలో ప్రారంభమైంది. BAPS స్వామీనారాయణ్ సంస్థ. రాబిన్స్ విల్లేలో దీన్ని నిర్మించింది. స్వామీ నారాయణ్ అక్షర్‌ధామ్‌గా పిలిచే ఈ ఆలయం 185 ఎకరాల్లో విస్తరించి ఉంది. పూర్తి ప్రాచీన హిందూ నిర్మాణ శైలిలోనే నిర్మించిన ఈ ఆలయం.. అమెరికాలోని హిందువులకు అందుబాటులోకి వచ్చింది. భారత్‌కు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న అమెరికాలోని న్యూజెర్సీలో భారీ హిందూ ఆలయం అక్కడి భక్తులకు అందుబాటులోకి వచ్చింది. 2011లో 185 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో BAPS అక్షర్‌ధామ్ స్వామీనారాయణ్ సంస్థ.. దీని నిర్మాణం ప్రారంభించింది.
ఈ మందిరాన్ని 19వ శతాబ్ధపు ఆధ్యాత్మిక గురువు భగవాన్ స్వామీనారాయణ్‌కు అంకితం చేశారు. ఆలయంలో అతిపెద్ద దీర్ఘవృత్తాకార గోపురం ఉంటుంది. అడుగడుగునా భారతీయ సంస్కృతులు, కళ ఉట్టిపడేలా ఆలయ నిర్మాణం జరిగింది. ఈ ఆలయంలో ప్రధాన గర్భగుడి, 12 ఉపాలయాలు, 9 శిఖరాలతో పాటు భారీ గుమ్మటం ఏర్పాటు చేశారు. బ్రహ్మకుండ్ పేరుతో ఏర్పాటు చేసిన బావిలో ప్రపంచంలోని 300 నదుల నుంచి తీసుకొచ్చిన నీటిని నింపారు. ఆలయం చుట్టూ అనేక మొక్కలను నాటారు. అమెరికాలో వివిధ ప్రాంతాల నుంచి స్వచ్ఛందంగా వచ్చిన వాలంటీర్లు ఈ మందిర నిర్మాణంలో భాగస్వాములయ్యారు. ఈ ఆలయంలో మొత్తం 10వేల విగ్రహాలు ఉన్నాయి. 150భారతీయ వాయిద్య పరికరాలు ఉండే శిల్పాలు,భరతనాట్యంలోని 110 నృత్యభంగిమలు గల శిల్పాలను మందిర గోడలపై అద్భుతంగా చెక్కారు. ఆలయ నిర్మాణం కోసం 4 రకాల రాతిని ఎంచుకున్నారు. లైమ్ స్టోన్, పింక్ స్టోన్, సాండ్ స్టోన్, మార్బుల్, గ్రనైట్‌ను నిర్మాణంలో వాడారు. 21 క్యూబిక్ అడుగుల రాతిని వినియోగించారు. అనేక ఏళ్లపాటు ఆలయం నిలిచిపోయేలా జాగ్రత్తలు తీసుకున్నారు.
మొత్తం 183 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. వేల ఏళ్ల క్రితమే శిథిలమైన ఆలయం స్థానంలో ఈ ఆలయ పునర్నిర్మాణం చేశారు. ఈ భారీ ఆలయ నిర్మాణం కోసం ఉత్తర అమెరికా నలు మూలల నుంచి 12,500 మంది స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. దేశంలోని ఇతర అక్షర్‌ధామ్ ఆలయాల మాదిరిగానే ఈ ఆలయాన్ని కూడా డిజైన్ చేశారు. ఈ ఆలయ నిర్మాణానికి 12 సంవత్సరాల సుదీర్ఘ సమయం పట్టింది. ఆలయంలో 10 వేలకు పైగా విగ్రహాలు ఉన్నాయి. భారతీయ సంగీత పరికరాలు, నృత్య రీతులకు సంబంధించిన శిల్పాలు ఉన్నాయి. నిర్మాణ పనులు పూర్తి చేసుకున్న ఈ ఆలయాన్ని వచ్చే నెల 8న అధికారికంగా ప్రారంభించనున్నారు.