Canada Elections Results: గెలుపు బాట‌లో లిబ‌ర‌ల్ పార్టీ, దూసుకెళ్తున్న మార్క్‌ కార్నీ

కెనడాలో వెలువడుతున్న ఎన్నికల ఫలితాలు;

Update: 2025-04-29 05:00 GMT

కెన‌డా పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో లిబ‌రల్ పార్టీ విజ‌యం దిశ‌గా వెళ్తోంది. ప్ర‌ధానిగా మార్క్ కార్నేఎన్నిక‌య్యే అవ‌కాశాలు ఉన్నాయి. ప్ర‌ధాని పొజిష‌న్‌ను ఆయ‌న దాదాపు సుస్థిరం చేసుకున్న‌ట్లు తాజా స‌మాచారం ప్రకారం తెలుస్తోంది. మార్చి నెల‌లో జ‌స్టిస్ ట్రూడో త‌ప్పుకున్న త‌ర్వాత‌.. రెండు నెల‌ల్లోనే ఓట‌ర్ల మ‌న‌సును కార్నే గెలుచుకోగ‌లిగారు. ముఖ్యంగా అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ వాణిజ్య విధానాల‌కు మార్క్ కార్నే గ‌ట్టిగా కౌంట‌ర్ ఇచ్చారు. త‌న ఎన్నిక‌ల ప్ర‌చారం ఆయ‌న ట్రంప్‌నే టార్గెట్ చేశారు.

గ‌తంలో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ చీఫ్‌గా చేశారు. రాజ‌కీయంగా ఎటువంటి హోదాలో లేరు. కానీ ట్రంప్ వ్య‌తిరేక ప్ర‌చారంతో ఆయ‌న అడ్వాంటేజ్ సాధించారు. దీంతో ఓట్ల‌ను గెలుచుకోగ‌లిగిన‌ట్లు అంచ‌నా వేస్తున్నారు. కెన‌డా ఆర్థిక వ్య‌వ‌స్థను బ‌లోపేతం చేయ‌డమే త‌న ల‌క్ష్య‌మ‌ని కార్నే పేర్కొన్నారు. ప్ర‌స్తుతం చీక‌టి రోజులు ఉన్నాయ‌ని తెలుసు అని పేర్కొన్నారు. కార్బ‌న్ ట్యాక్స్‌ను ర‌ద్దు చేశారు. ప‌ర్యావ‌ర‌ణ స‌మ‌తుల్య‌త గురించి ఎన్నిక‌ల ప్ర‌చారంలో చేశారాయ‌న‌.

కార్నేకు పార్ల‌మెంట్‌లో పూర్తి మ‌ద్ద‌తు వ‌స్తుందా లేదా అన్న విష‌యం ఇంకా స్ప‌ష్టంగా తెలియ‌దు. ఆయ‌న‌కు ఎవ‌రు స‌పోర్టు ఇస్తారో కూడా ఇప్ప‌డే చెప్ప‌లేం. పియ‌రీ పొయిలివ్రే కు చెందిన క‌న్జ‌ర్వేటివ్ పార్టీ కీల‌క స్థానాల్లో గెలిచినా, ఆ పార్టీ ప‌రాజ‌యం అంచున ఉన్న‌ది. హౌజ్ ఆఫ్ కామ‌న్స్‌లో మొత్తం 343 స్థానాలు ఉన్నాయి. వాటిల్లో లిబ‌ర‌ల్ పార్టీ 156 స్థానాల్లో విజ‌యం దిశ‌గా వెళ్తున్న‌ది. అయితే చిన్న పార్టీల సాయంతో లిబ‌ర్ పార్టీ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసే అవ‌కాశాలు ఉన్నాయి. సీటీవీ ప్ర‌కారం.. క‌న్జ‌ర్వేటివ్ పార్టీ 145 స్థానాల్లో ముందున్న‌ది.

Tags:    

Similar News