భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ మధ్య స్నేహం ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ బ్రెజిల్ లోని రియో డి జనిరోలో జరుగుతున్న జీ 20 శిఖరాగ్ర సదస్సు లో కలిశారు. వీరిద్దరు కలిసి దిగే ఫొటోలు మోలోడీ పేరుతో ట్రెండింగ్ అయ్యాయి. రక్షణ, భద్రత, వాణిజ్యం, సాంకేతిక అంశాల్లో సహకారం గురించి చర్చించా మని మెలోనీతో చర్చించానని భారత ప్రధాని వెల్లడించారు. ఈ రెండు దేశాల సంబంధాలు మెరుగైన ప్రపంచానికి దోహదం చేస్తాయని ఆశాభావం వ్యక్తంచేశారు. భారత్, ఇటలీ ప్రధానులు మోదీ, జార్జియా మెలోనీ మధ్య స్నేహం వాళ్లు దిగే ఫొటోల్లో కనిపిస్తుంది. మెలోడీ (మెలోనీ+మోదీ) పేరిట ఆ చిత్రాలు పలుమార్లు ట్రెండ్ అయ్యాయి. తాజాగా జీ 20 వేదికగా ఈ 'మెలోడీ’ మూమెంట్ మళ్లీ ట్రెండింగ్ గా మారింది.