Aliens Dead Bodies: మెక్సికో దేశ చట్టసభలో అవశేషాల ప్రదర్శన
ఏలియన్స్ డెడ్ బాడీలు వీడియోలు వైరల్;
ఏలియన్స్ ఉన్నాయా? లేవా? ఉంటే ఎలా ఉంటాయి? ఎక్కడ ఉంటాయి?..అవి ఎలా ప్రయాణిస్తాయి.. ఇలాంటి ప్రశ్నలకు సమాధానంగా మెక్సికో లో ఏలియన్ అవశేషాలను ను ప్రదర్శించారు. రెండు చెక్క పెట్టెల్లో ఉన్న ఏలియన్స్ అవశేషాలను చట్ట సభల వేదికగా ప్రదర్శించారు సైంటిస్టులు. ఆదేశ జర్నలిస్ట్, యూఫోలజిస్ట్ జైమ్ మౌసాన్ ఈ బాక్స్‌లను ఓపెన్ చేసి ప్రదర్శనకు పెట్టారు. అమెరికన్స్ ఫర్ సేఫ్ ఏరోస్పేస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రియాన్ గ్రేవ్స్, అమెరికా నేవీ మాజీ పైలట్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ ప్రదర్శన గ్రహాంతర జీవుల ఉనికి గురించి మరోసారి చర్చకు దారితీసింది.
మెక్సికో దేశ చట్టసభలో ఏలియన్ అవశేషాలను ప్రదర్శించారు. జర్నలిస్ట్, యూఫోలజిస్ట్ జైమ్ మౌసాన్ ఈ బాక్సులను తెరిచి చూపించారు. ఈ రెండు గ్రహాంతర జీవుల శిలాజ అవశేషాలను వేల ఏండ్ల కిందట పెరూలోని కుస్కో నుంచి వెలికితీసినట్టు మౌసాన్ తెలిపారు. ఇవి మన భూగోళానికి చెందినవి కావని అన్నారు. అలాగే గుర్తు తెలియని ఎగిరే వస్తువు శిథిలాల నుంచి కనుగొన్న జీవులు కూడా కాదని స్పష్టం చేశారు. డయాటమ్ (ఆల్గే) గునుల్లో బయటపడిన శిలాజ అవశేషాలని చెప్పారు. మెక్సికో కాంగ్రెస్‌లో ప్రదర్శించిన ఏలియన్ అవశేషాల వీడియో క్లిప్‌లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
విశ్వంలో మనం ఒంటరిగా లేమని, ఇవిగో సాక్ష్యాలు అంటూ మెక్సికన్ చట్ట సభ ప్రతినిథులు దీనిని చూపిస్తూ ప్రకటించారు. చిన్న శరీరాకృతి కలిని ఈ రెండు ఏలియన్స్‌కి ప్రతి చేతికి మూడు వేళ్లు, పొడవాటి చేతులు ఉన్నాయి. మెక్సికో నేషనల్ అటానమస్ యూనివర్సిటీ కార్బన్ డేటింగ్ ప్రక్రియ ద్వారా అవి సుమారు 1,000 సంవత్సరాల నాటివిగా గుర్తించారు. అయితే, ఇవి దాదాపు మమ్మీ అవశేషాలుగా కనిపిస్తున్నా.. వీటిని స్కాన్ చేసి చూస్తే షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. ఈ అవశేషాలపై ఎక్స్-రేలు, 3-డి పునర్నిర్మాణం, డీఎన్‌ఏ విశ్లేషణలు జరిపారు. ఈ అవశేషాల లోప గడ్లు కనిపించాయి. వీటిని పిండాలుగా చెప్పుకొచ్చారు మౌసాన్.
అయితే, మెక్సికన్ చట్ట సభల్లో ప్రదర్శించిన ఈ ఏలియన్స్ అవశేషాలు నిజంగా నిజమైనవేనా? అనే సందేహాలు ప్రపంచ వ్యాప్తంగా వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై చర్చించేందుకు నాసా సైంటిస్టులు సైతం సిద్ధమయ్యారు. మొత్తంగా ఏలియన్స్ వ్యవహారం ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.