భారీ వర్షంలోనూ మోదీ దేశభక్తి
అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ.... న్యూయార్క్‌లో భారీ వర్షంలోనూ మోడీకి ఘన స్వాగతం... జాతీయ గీతాన్ని ఆలపిస్తున్న వేళ భారీ వర్షంలో మోడీ... జాతీయ గీతం పూర్తయాకే కదిలిన మోడీ;
అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోడీకి న్యూయార్క్‌లో భారీ వర్షంలోనూ ఘన స్వాగతం లభించింది. వర్షంలోనూ పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ప్రవాస భారతీయులు.. వాషింగ్టన్ చేరుకున్న ప్రధానికి ఘన స్వాగతం పలికారు. జాతీయ గీతాన్ని ఆలపిస్తున్న వేళ భారీ వర్షంలోనూ మోడీ అలాగే నిలబడిపోయారు. జాతీయ గీతం పూర్తయిన తర్వాతే అక్కడి నుంచి కదిలి మోడీ దేశభక్తిని ప్రదర్శించారు. అనంతరం అండ్రూస్ జాయింట్ బేస్ విమానాశ్రయంలో గౌరవ వందనం స్వీకరించారు. వర్షం పడుతుండటంతో రెయిన్ కోట్ ధరించిన ఆయన గౌరవ వందనం స్వీకరించారు. ఆ తరువాత వైట్ హౌస్ చేరుకున్న ప్రధానిని అధ్యక్షుడు బైడెన్‌కు ప్రత్యేక బహుమతులు సమర్పించారు.