Mark Rutte: రష్యాతో స్నేహం చేస్తే 100 శాతం సుంకం: నాటో హెచ్చరికలు

భారత్, చైనాకు నాటో చీఫ్ వార్నింగ్;

Update: 2025-07-16 05:00 GMT

ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధాన్ని ఆపేందుకు రష్యా ను ఆర్థికంగా దెబ్బతీసేలా అమెరికా ప్రయత్నిస్తుంది. దేశాల మధ్య మళ్లీ ఉద్రిక్తతలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రశాంత వాతావరణం నెలకొనగా.. ఉక్రెయిన్-రష్యా యుద్ధం కారణంగా మళ్లీ టెన్షన్ వాతావరణం నెలకొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉక్రెయిన్‌పై యుద్ధం ఆపాలని రష్యాపై అమెరికా ఒత్తిడి తెస్తోంది. కానీ పుతిన్ మాత్రం ఏ మాత్రం వెనుకడుగు వేయడం లేదు. యుద్ధం ఆపేదిలేదని తెగేసి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రష్యాతో వాణిజ్య సంబంధాలు కలిగిన దేశాలను ఇబ్బంది పెట్టాలని ట్రంప్ భావిస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి వార్నింగ్ ఇచ్చారు. రష్యాతో సంబంధాలు కలిగిన దేశాలపై 500 శాతం సుంకాలు విధిస్తామని.. భారత్, చైనాలను హెచ్చరించారు. అంతేకాకుండా 50 రోజుల్లో రష్యా శాంతి ఒప్పందాలకు రాకపోతే భారీగా సుంకాలు విధిస్తామని రష్యాను హెచ్చరించారు. ఇలా రష్యాపై అనేక రకాలుగా ఒత్తిళ్లు పెంచుతున్నారు.

తాజాగా నాటో చీఫ్ మార్క్ రుట్టే కూడా రష్యాతో వాణిజ్య సంబంధాలు కలిగిన భారత్, చైనా, బ్రెజిల్‌కు వార్నింగ్ ఇచ్చారు. రష్యాతో వ్యాపారం కొనసాగిస్తే తీవ్రంగా నష్టపోతారని బ్రెజిల్, చైనా, భారతదేశానికి నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే బుధవారం హెచ్చరించారు.

మార్క్ రుట్టే అమెరికా కాంగ్రెస్‌లో సెనేటర్లతో సమావేశం అయ్యారు. ట్రంప్‌తో కూడా భేటీ అయ్యారు. ఈ భేటీ తర్వాతే మార్క్ రుట్టే ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్, చైనా, బ్రెజిల్ దేశాలు పరిశీలన చేసుకోవాలని.. లేదంటే తీవ్రంగా దెబ్బతినాల్సి ఉంటుందని విలేకర్లతో మాట్లాడుతూ రుట్టే ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ మూడు దేశాల పెద్దలు పుతిన్‌కు ఫోన్ చేసి శాంతి చర్చల గురించి ఆలోచించాలని చెప్పాలని సూచించారు. లేదంటే భారత్, చైనాపై భారీ స్థాయిలో తీవ్ర ప్రభావం పడొచ్చని చెప్పుకొచ్చారు.

ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఆపేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. కానీ రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం అందుకు అంగీకరించట్లేదు. దీంతో ట్రంప్‌కు కోపం వచ్చింది. ఉక్రెయిన్‌కు ఆయుధాలు సరఫరా చేసి.. మాస్కోను దెబ్బకొట్టాలని ప్రణాళికలు రచిస్తున్నారు.

Tags:    

Similar News