Nepal Plane Crash : నేపాల్ విమాన ప్రమాదం.. జానపద గాయని మృతి
Nepal Plane Crash : నేపాల్‌లో ఆదివారం భారీ ప్రమాదం జరిగింది. విమానం కూలి అందులో ప్రయాణిస్తున్న 72 మంది ప్రాణాలు కోల్పోయారు..;
Nepal Plane Crash: నేపాల్‌లో ఆదివారం భారీ ప్రమాదం జరిగింది. విమానం కూలి అందులో ప్రయాణిస్తున్న 72 మంది ప్రాణాలు కోల్పోయారు.. ఈ విషాద సంఘటన ప్రపంచ ప్రజలందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆదివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నేపాల్‌కు చెందిన యతి ఎయిర్‌లైన్స్ విమానం ఖాట్మండు నుంచి పోఖారాకు వెళ్తోంది. పోఖారా విమానాశ్రయానికి చేరుకోవడానికి 10 సెకన్ల ముందు ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పోఖారా లోయ నుంచి సేతి నది లోయలోకి విమానం పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 69 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మృతదేహాలలో ఒకటి నేపాల్ ప్రసిద్ధ జానపద గాయని నీరా చంత్యాల్ అని అధికారులు ధృవీకరించారు.
మీడియా కథనాల ప్రకారం, గాయని నీరా చంత్యాల్ పోఖారాలో ఒక సంగీత కచేరీకి హాజరుకానున్నారు. కానీ విధివశాత్తు విమాన ప్రమాదంలో మరణించింది. నీరా పాటలు నేపాల్ ప్రజలందరికీ సుపరిచితం. ఆమె పిర్తికో డోరీతో చాలా అందమైన నేపాలీ పాటలు పాడుతూ సంగీత ప్రియులను అలరిస్తుంది. నీరా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండేది కాదు. కానీ ఎక్కడైనా ప్రదర్శన ఇచ్చినప్పుడు వాటి వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసేది.