Nepal: సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల నిషేధ నిరసనలు.. సురక్షిత ప్రాంతాలకు మంత్రులు
దేశవ్యాప్తంగా ప్రదర్శనలు తీవ్రతరం కావడంతో మంత్రులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు.
దేశవ్యాప్తంగా నిరసనలు తీవ్రమవడంతో, నేపాలీ సైన్యం భైసేపతిలోని మంత్రులను వారి నివాసాల నుండి హెలికాప్టర్లను ఉపయోగించి ఖాళీ చేయడం ప్రారంభించింది. మంత్రులు, సీనియర్ అధికారుల ఇళ్లను లక్ష్యంగా చేసుకుని వరుస దహనం, విధ్వంస సంఘటనల తర్వాత అదికార యంత్రాంగం మంత్రులను వారి నివాసాల నుంచి ఖాళీ చేయించే చర్య చేపట్టింది.
భైసేపతిలోని మంత్రి నివాసానికి కూడా నిరసనకారులు నిప్పు పెట్టారు. పార్లమెంటు భవనాన్ని కాపాడటానికి సైన్యాన్ని కూడా మోహరించినట్లు సీనియర్ భద్రతా అధికారులు తెలిపారు. సైనిక బ్యారక్‌ల వద్ద ఉన్నత స్థాయి అధికారులకు భద్రత కల్పిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితిపై ప్రధానమంత్రి కెపి శర్మ ఓలి మంత్రులతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.